వంగవీటిని పొట్టనపెట్టుకున్నారు... మీ బురదకు విరుగుడు అస్త్రాలు మాకూ ఉన్నాయి

కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్రమాజీ మంత్రి దాసరినారాయణ రావు తీవ్రంగా తప్పుపట్టారు. ముద్రగడ దీక్ష, ప్రభుత్వ అణచివేత ధోరణి నేపథ్యంలో హైదరాబాద్ పార్క్ హయత్‌ హోటల్‌లో కాపు ప్రముఖులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి కాపుల సమస్యను ఉగ్రవాద సమస్యలాగా ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు వంగవీటి రంగాను పొట్టనపెట్టుకున్నారని… ఇప్పుడు ముద్రగడను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న భయం తమలో ఉందన్నారు దాసరి. ఒక జాతి పట్ల […]

Advertisement
Update: 2016-06-13 21:00 GMT

కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్రమాజీ మంత్రి దాసరినారాయణ రావు తీవ్రంగా తప్పుపట్టారు. ముద్రగడ దీక్ష, ప్రభుత్వ అణచివేత ధోరణి నేపథ్యంలో హైదరాబాద్ పార్క్ హయత్‌ హోటల్‌లో కాపు ప్రముఖులు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి కాపుల సమస్యను ఉగ్రవాద సమస్యలాగా ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.

ఒకప్పుడు వంగవీటి రంగాను పొట్టనపెట్టుకున్నారని… ఇప్పుడు ముద్రగడను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న భయం తమలో ఉందన్నారు దాసరి. ఒక జాతి పట్ల వివక్ష చూపడం దారుణమన్నారు. ముద్రగడ దీక్ష వివరాలను కాపులకు తెలియకుండా ఛానళ్ల ప్రసారాలను ప్రభుత్వం కట్ చేస్తోందని మండిపడ్డారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి చుట్టూ జామర్లు పెట్టి కనీసం ముద్రగడతో ఎవరూ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలు చరిత్రలో జరగలేదన్నారు.

పాకిస్తాన్‌లో ఉన్నామా అన్న అభిప్రాయం కలిగేలా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఉందన్నారు. ముద్రగడ చర్చలకు సిద్ధమన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపు మంత్రుల చేత ముద్రగడపై, కాపు ఉద్యమకారులపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. లేకుంటే కాపు మంత్రుల బురదకు విరుగుడుగా తమ వద్ద కూడా చాలా అస్త్రాలు ఉన్నాయని హెచ్చరించారు దాసరి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News