తెలంగాణను టార్గెట్ చేసిన వర్మ

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ట్విట్టర్ హీరో అయిపోయాడు. అతడి సినిమాల కంటే ట్వీట్సే ఎక్కువ హిట్ అవుతున్నాయి. ఎప్పుడూ ట్విట్ట ర్ లో  ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేయడం అతడికి అలవాటైపోయింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రితో… అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను పోల్చాడు వర్మ. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా వర్మ తన ట్విట్టర్ లో.. అమెరికా అధ్యక్ష పీఠం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న […]

Advertisement
Update: 2016-06-12 01:50 GMT
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ట్విట్టర్ హీరో అయిపోయాడు. అతడి సినిమాల కంటే ట్వీట్సే ఎక్కువ హిట్ అవుతున్నాయి. ఎప్పుడూ ట్విట్ట ర్ లో ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేయడం అతడికి అలవాటైపోయింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రితో… అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను పోల్చాడు వర్మ. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా వర్మ తన ట్విట్టర్ లో.. అమెరికా అధ్యక్ష పీఠం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై…. అమెరికన్లు స్పందిస్తున్న తీరు చూస్తుంటే కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు రియాక్ట్ అయిన విధానం గుర్తుకువస్తుందని ట్వీట్ చేశాడు వర్మ. దీన్నిబట్టి తెలంగాణా ప్రజలు అమెరికన్స్ కంటే సూపర్ స్మార్ట్ అని అర్థమవుతుందని వెల్లడించాడు. చివరగా తన ట్వీట్ లో ‘జై తెలంగాణ’ అంటూ వర్మ ఎప్పటిలాగే నెటిజన్లను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్ష పదవి రేసులో డొనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పోటాపోటీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్నిసార్లు ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేసిన వర్మ ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనను కేసీఆర్ తో పోలుస్తూ తెలంగాణ ప్రజలను ఆకాశానికి ఎత్తేయడం ఆసక్తికరంగా మారింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News