మమ్మల్ని చేరదీసింది వైఎస్సే... జగన్‌కు మాత్రం...

వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీకి ఎదురుండదని మాజీ మంత్రి టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… గతంలో కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు అనుగుణంగానే తాము చంద్రబాబును విమర్శించామని చెప్పారు. చంద్రబాబుతో వ్యక్తిగతంగా తమకు ఎప్పుడూ వైరం లేదన్నారు. తన రాజకీయ జీవితం మొదలైందే టీడీపీలోనని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్‌తో బాగా సన్నిహితంగా ఉండేవారిమని చెప్పారు. తమను కాంగ్రెస్‌లో చేరదీసింది వైఎస్సేనన్నారు. జగన్‌కు మాత్రం రాజకీయ మనుగడ లేదన్నారు. […]

Advertisement
Update: 2016-06-12 10:59 GMT

వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీకి ఎదురుండదని మాజీ మంత్రి టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… గతంలో కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు అనుగుణంగానే తాము చంద్రబాబును విమర్శించామని చెప్పారు. చంద్రబాబుతో వ్యక్తిగతంగా తమకు ఎప్పుడూ వైరం లేదన్నారు. తన రాజకీయ జీవితం మొదలైందే టీడీపీలోనని చెప్పారు.

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్‌తో బాగా సన్నిహితంగా ఉండేవారిమని చెప్పారు. తమను కాంగ్రెస్‌లో చేరదీసింది వైఎస్సేనన్నారు. జగన్‌కు మాత్రం రాజకీయ మనుగడ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ పార్టీ ప్రభావం ఉండదన్నారు. వైసీపీలో చేరేందుకు తాము ప్రయత్నించామన్నది నిజం కాదన్నారు. డబ్బుల కోసమే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారంటే తాను నమ్మనని ఆనం చెప్పారు. రాజకీయాల్లో ఉన్నాక తెరచాటు రాజకీయాలు కూడా చేయక తప్పదన్నారు.

తనకు వేల కోట్ల ఆస్తులు లేవన్నారు. వంద కోట్లు చూపినా సంతోషమేనన్నారు. కుటుంబపరంగా కొన్ని విభేదాలున్న మాట వాస్తవమేనన్నారు. అన్న ఆనం వివేకా మాటకు ఎదురుచెప్పేవాడిని తానుకాదన్నారు. అమరావతి అభివృద్ది జరిగితే దాని వల్ల స్టేట్‌ మొత్తం మంచి జరుగుతుందన్నారు. తన కూతురు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సొంత బిడ్డలనే ఊచకోత కోసి పాతిపెట్టిందన్నారు.

చచ్చిపోయిన కాంగ్రెస్‌ను బతికించడం సాధ్యమయ్యే పనికాదన్నారు. పార్టీలో చేరిన కొత్తలో ఇచ్చినంతగా ఇప్పుడు టీడీపీ అధినేత తమకు గౌరవం ఇవ్వడం లేదన్న వార్తల్లో నిజం లేదని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. అప్పుడు ఇప్పుడు తమను గౌరవంగానే చూసుకుంటున్నారని చెప్పారు. కిరణ్‌కుమార్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు తాను ప్రయత్నించలేదన్నారు. ఒకవేళ అలా చేసినా తానే సీఎం అవుతానన్న గ్యారెంటీ కాంగ్రెస్‌లో ఉండదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News