టార్గెట్ బుగ్గన...

వైసీపీ తరపున పంచ్‌లు వేస్తూ మాట్లాడే వ్యక్తిగా పేరున్న డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అధికార పార్టీ టార్గెట్ చేసినట్టుగా ఉంది. 1929 నుంచి బుగ్గన కుటుంబం ఆధీనంలో ఉన్న భూములను నోటీసులు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. ఇది ప్రభుత్వ కక్షసాధింపుచర్యేనని బుగ్గన ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తనను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ ఉద్దేశపూర్వకంగా, భూసేకరణ చట్టానికి విరుద్దంగా భూమి లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తానుకోర్టుకు వెళ్లి భూములు […]

Advertisement
Update: 2016-06-09 21:57 GMT

వైసీపీ తరపున పంచ్‌లు వేస్తూ మాట్లాడే వ్యక్తిగా పేరున్న డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అధికార పార్టీ టార్గెట్ చేసినట్టుగా ఉంది. 1929 నుంచి బుగ్గన కుటుంబం ఆధీనంలో ఉన్న భూములను నోటీసులు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. ఇది ప్రభుత్వ కక్షసాధింపుచర్యేనని బుగ్గన ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తనను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ ఉద్దేశపూర్వకంగా, భూసేకరణ చట్టానికి విరుద్దంగా భూమి లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

తానుకోర్టుకు వెళ్లి భూములు లాక్కోకుండా స్టే తెచ్చుకున్నప్పటికీ ప్రభుత్వం వదిలిపెట్టడంలేదని మండిపడ్డారు. 1929నుంచి భూమి తమ ఆధీనంలోనే ఉందని ఇప్పుడు హఠాత్తుగా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే కోర్టు ద్వారా భూముల స్వాధీనాన్ని అడ్డుకున్నానని..కానీ ప్రభుత్వం కక్ష సాధింపు మానుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ లీజులను హడావుడిగా రద్దు చేసిందని బుగ్గన చెప్పారు. ఇష్టానుసారం గనుల లీజు రద్దును హైకోర్టు కూడా తప్పుపట్టిందని, ఇప్పటికైనా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. భూములు ఇవ్వకుండా బుగ్గన అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి ఉమా చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు.

నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ఇంట్లో ఒక ఆరడుగుల భూమిని ప్రభుత్వం తీసుకుంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. గతంలో భూమా నాగిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్ లాంటి వారిని కేసులు, వ్యాపారాలను బూచిగా చూపించి చంద్రబాబు లొంగదీసుకున్నారు. డబ్బులు, మంచి ఆఫర్లుకూడా ప్రకటించడంతో ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఇప్పుడు వైసీపీలో బుగ్గన చాలా విషయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News