కొడుకును కొట్టారు...సాక్షిని కట్ చేశారు... కొత్త రకం టెర్రరిజానికి నాంది పలుకుతున్నావ్...

ముద్రగడ దీక్ష విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్షనేత జగన్ తీవ్రంగా ఖండించారు. ముద్రగడ తన ఇంటిలో దీక్ష చేసుకుంటే అది శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. సామాజిక సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన జగన్… కిర్లంపూడి లాంటి చిన్న గ్రామంపై అంతమంది పోలీసులను పంపి దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. ముద్రగడ కుమారుడితో పాటు ఆయన కుటుంబసభ్యులను కూడా పోలీసులు కొట్టడం […]

Advertisement
Update: 2016-06-10 00:56 GMT

ముద్రగడ దీక్ష విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతిపక్షనేత జగన్ తీవ్రంగా ఖండించారు. ముద్రగడ తన ఇంటిలో దీక్ష చేసుకుంటే అది శాంతిభద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. సామాజిక సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన జగన్… కిర్లంపూడి లాంటి చిన్న గ్రామంపై అంతమంది పోలీసులను పంపి దారుణంగా వ్యవహరించారని విమర్శించారు.

ముద్రగడ కుమారుడితో పాటు ఆయన కుటుంబసభ్యులను కూడా పోలీసులు కొట్టడం దారుణమన్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఉన్నాయన్నారు. ముద్రగడ దీక్ష వార్తలను కవర్ చేయవద్దంటూ అనుకూల టీవీఛానళ్లను ఆదేశించిన చంద్రబాబునాయుడు…సాక్షి టీవీ ప్రసారాలను ఏకంగా నిలిపివేయించారని అన్నారు. తమిళనాడులో కూడా పార్టీలకు ఛానళ్లు ఉన్నాయని కానీ ఏనాడు ప్రతిపక్ష పార్టీల ఛానళ్లను బంద్‌ చేయించిన చరిత్ర లేదన్నారు. సాక్షి ప్రసారాలను నిలిపివేయడం ద్వారా చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెరలేపారని జగన్ అన్నారు.

గతంలో వైఎస్‌కు వ్యతిరేకంగా అనేక టీవీ ఛానళ్లు పనిచేశాయని కానీ ఏనాడు టీవీ ఛానళ్ల ప్రసారాలను వైఎస్ అడ్డుకోలేదని చెప్పారు. చంద్రబాబు పోలీస్ రాజ్యం నడపాలనుకుంటున్నారు. పోలీస్ టెర్రరిజం అన్న పదానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారని జగన్ ఆక్షేపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్నారు. పరిటాల రవి హత్య సమయంలో రాష్ట్రంలో బస్సులు తగలబెట్టి అల్లకల్లోలం సృష్టించాలని ఆదేశించిన చరిత్ర చంద్రబాబుదన్నారు జగన్. తుని కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News