నేరస్తుల వ్యాన్‌లో ముద్రగడ తరలింపు... విద్రోహకశక్తులను అరెస్ట్ చేస్తే తప్పేంటి- గంటా... వారంతా రౌడీలే- చినరాజప్ప

తుని ఘటనలో పాల్గొన్న కాపులను పోలీసులు అరెస్ట్ చేయడంతో మరోసారి కాకపుట్టింది. కాపుల అరెస్ట్‌ను నిరసిస్తూ ముద్రగడ అమలాపురం పీఎస్ ముందు బైటాయించారు. తునిఘటనకు కర్త కర్మ క్రియ తానేనని ముందు తననే అరెస్ట్ చేయాలంటూ పీఎస్‌లో ఆందోళనకు దిగారు. డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. కేసు తమ పరిధిలో లేదని రైల్వేపోలీసుల ఆధీనంలో ఉందని డీఎస్పీచెప్పడంపై ముద్రగడ ఆగ్రహంవ్యక్తం చేశారు. రైల్వే పోలీసులు పరిధిలో కేసు ఉంటే కాపులను ఏపీ పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటూప్రశ్నించారు. ముద్రగడకు […]

Advertisement
Update: 2016-06-07 02:00 GMT

తుని ఘటనలో పాల్గొన్న కాపులను పోలీసులు అరెస్ట్ చేయడంతో మరోసారి కాకపుట్టింది. కాపుల అరెస్ట్‌ను నిరసిస్తూ ముద్రగడ అమలాపురం పీఎస్ ముందు బైటాయించారు. తునిఘటనకు కర్త కర్మ క్రియ తానేనని ముందు తననే అరెస్ట్ చేయాలంటూ పీఎస్‌లో ఆందోళనకు దిగారు. డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. కేసు తమ పరిధిలో లేదని రైల్వేపోలీసుల ఆధీనంలో ఉందని డీఎస్పీచెప్పడంపై ముద్రగడ ఆగ్రహంవ్యక్తం చేశారు. రైల్వే పోలీసులు పరిధిలో కేసు ఉంటే కాపులను ఏపీ పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటూప్రశ్నించారు. ముద్రగడకు మద్దతుగా కాపులు కూడా రోడ్లపైకి వచ్చారు. అమలాపురంలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబు, చినరాజప్పలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు ముద్రగడను రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలిస్తామనిపోలీసులు చెప్పారు. నేరస్తులను తీసుకెళ్లే వ్యాన్‌లోనే ముద్రగడను తీసుకెళ్లారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News