వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్ఏ విభాగం ఆధ్వర్యంలో "ఎంపరర్‌ ఆఫ్ కరెప్షన్" ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబునాయుడు స్థాపిస్తున్న అవినీతి సామ్రాజ్యం, కుంభకోణాలపై రచించిన “ఎంపరర్‌ ఆఫ్ కరెప్షన్” పుస్తకాన్ని యూఎస్‌ఏలోని నాటా ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ఆర్‌సీపీ యూఎస్ఏ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈవెంట్‌కు 10 వేల మంది తెలుగు వారు హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ యూఎస్ఏ కమిటీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఇందుకు తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ” చంద్రబాబు ది […]

Advertisement
Update: 2016-05-31 04:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబునాయుడు స్థాపిస్తున్న అవినీతి సామ్రాజ్యం, కుంభకోణాలపై రచించిన “ఎంపరర్‌ ఆఫ్ కరెప్షన్” పుస్తకాన్ని యూఎస్‌ఏలోని నాటా ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ఆర్‌సీపీ యూఎస్ఏ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈవెంట్‌కు 10 వేల మంది తెలుగు వారు హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ యూఎస్ఏ కమిటీ సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఇందుకు తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ” చంద్రబాబు ది ఎంపరర్‌ ఆఫ్ కరెప్షన్‌” పుస్తకంలోని అంశాలపై తెలుగువారు ఆసక్తికనబరిచారు. అమెరికా తెలుగువారిని వైసీపీకి దగ్గర చేయడంలో వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ విభాగం చూపుతున్న చొరవను ఎంపీ మిథున్ రెడ్డి అభినందించారు. ప్రస్తుతం రాజకీయాలు ముఖ్యం కాదని… చంద్రబాబు సాగిస్తున్న అవినీతి, ఆరాచక రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మిథున్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఉన్న తెలుగువారు ఈ విషయంలో ఆలోచించాలని కోరారు.

 

”ఎంపరర్‌ ఆఫ్ కరెప్షన్” బుక్‌ను ఆవిష్కరిస్తున్న మిథున్ రెడ్డి, గోపిరెడ్డి

వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్ఏ కమిటీ సభ్యులతో ఎంపీ, ఎమ్మెల్యే
తెలుగువారితో NATA కన్వెన్షన్ సెంటర్
Tags:    
Advertisement

Similar News