జమ్మలమడుగు చూసి భయపడ్డ బాబు

మహానాడుకు ముందు రాష్ట్రంలోని అన్నినియోజకవర్గాల్లో టీడీపీ మినీమహానాడు నిర్వహించింది. అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం మినీమహానాడు జరగలేదు.అదే కడప జిల్లా జమ్మలమడుగు. కడపజిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మినీమహానాడు నిర్వహించినప్పటికీ ఒక్క జమ్మలమడుగులో మాత్రం ఆ ఆలోచన చేయలేదు.దీనిపై మహానాడులో కొందరు నేతలు ఆరాతీయగా సీనియర్లు అసలు విషయం చెప్పారు. ఒంగోలులో గొట్టిపాటి, కరణం బలరాం వర్గాలుకొట్టుకోవడం, అనంతపురం మినీమహానాడులోఎమ్మెల్యే అత్తార్‌ బాషాను టీడీపీనేతలు ఆడుకోవడం చూసిన తర్వాత చంద్రబాబే పునరాలోచనలో పడ్డారట.మిగిలిన చోట్లసంగతి ఎలాఉన్నా జమ్మలమడుగులో […]

Advertisement
Update: 2016-05-28 02:49 GMT

మహానాడుకు ముందు రాష్ట్రంలోని అన్నినియోజకవర్గాల్లో టీడీపీ మినీమహానాడు నిర్వహించింది. అయితే ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం మినీమహానాడు జరగలేదు.అదే కడప జిల్లా జమ్మలమడుగు. కడపజిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మినీమహానాడు నిర్వహించినప్పటికీ ఒక్క జమ్మలమడుగులో మాత్రం ఆ ఆలోచన చేయలేదు.దీనిపై మహానాడులో కొందరు నేతలు ఆరాతీయగా సీనియర్లు అసలు విషయం చెప్పారు.

ఒంగోలులో గొట్టిపాటి, కరణం బలరాం వర్గాలుకొట్టుకోవడం, అనంతపురం మినీమహానాడులోఎమ్మెల్యే అత్తార్‌ బాషాను టీడీపీనేతలు ఆడుకోవడం చూసిన తర్వాత చంద్రబాబే పునరాలోచనలో పడ్డారట.మిగిలిన చోట్లసంగతి ఎలాఉన్నా జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గం ఒకే వేదికపైకి వస్తే మాత్రం పరిస్థితి అదుపుతప్పడం ఖాయమని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎంకు నివేదిక పంపాయని చెబుతున్నారు. దీంతో జమ్మలమడుగులో మినీమహానాడు అవసరం లేదని స్వయంగా చంద్రబాబే పార్టీ నేతలకు ఆదేశించారట. ఒక విధంగా రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య సయోధ్య కుదర్చడంలో నాయకత్వం విఫలమైందంటున్నారు. జమ్మలమడుగులోమహానాడు నిర్వహించలేకపోవడమే దీనికి నిదర్శనం అంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News