దిక్కూమొక్కు లేక ఎవడైతే వచ్చాడో వాళ్లదే ఈ తప్పుడు ప్రచారం

పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం మరోసారి నిప్పులు చెరిగారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో .. గొట్టిపాటి హనుమంతరావును రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే తానని చెప్పారు. తాను గొట్టిపాటి హనుమంతరావును జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేశానన్నారు. కరణం బలరాం పనైపోయిందని అందుకే ఇతరపార్టీల నుంచి యువనాయకత్వాన్ని చంద్రబాబు తీసుకొస్తున్నారన్న ప్రచారంపై బలరాం తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఏమీ కుర్రవాడు కాదు… తానేమీ పెద్దవాడిని కాదన్నారు. ఇద్దరి మధ్య వయసు […]

Advertisement
Update: 2016-05-25 10:58 GMT

పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం మరోసారి నిప్పులు చెరిగారు. ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో .. గొట్టిపాటి హనుమంతరావును రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే తానని చెప్పారు. తాను గొట్టిపాటి హనుమంతరావును జిల్లా పరిషత్ చైర్మన్‌గా చేశానన్నారు. కరణం బలరాం పనైపోయిందని అందుకే ఇతరపార్టీల నుంచి యువనాయకత్వాన్ని చంద్రబాబు తీసుకొస్తున్నారన్న ప్రచారంపై బలరాం తీవ్రంగా స్పందించారు.

చంద్రబాబు ఏమీ కుర్రవాడు కాదు… తానేమీ పెద్దవాడిని కాదన్నారు. ఇద్దరి మధ్య వయసు తేడా రెండేళ్లేనని చెప్పారు. దిక్కుమొక్కు లేక ఎవడైతే వచ్చాడో వాళ్లే ఈ తరహా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పరోక్షంగా గొట్టిపాటి వర్గంపై ఫైర్ అయ్యారు. కరణం దూకుడు కారణంగా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటోందని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజమైన టీడీపీ కార్యకర్తలను అడిగితే తన గురించి చెబుతారన్నారు.

టీడీపీ ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారో తెలియదా అని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెడితే జైలుకు వెళ్లి వచ్చింది తానన్నారు. ఈ కేసులకు కారణమైన వారే ఇప్పుడు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ఇబ్బందులను వివరించడంతోనే గొట్టిపాటి వర్గం పార్టీలోకి వచ్చే విషయంలో మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు. గొట్టిపాటి రాకపై అభ్యంతరాలను మాత్రం చంద్రబాబుకు వివరించామని చెప్పారు. పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వారు పబ్బం గడుపుకుని వెళ్తే బాగుంటుందని…పెత్తనం చేస్తామంటే మాత్రం కుదరదన్నారు. దొంగనాటకాలు వేసే వారి గురించి తెలుసన్నారు. వచ్చిన వాడే పార్టీ లైన్‌లో నడవాలి గానీ… తాము వారి దారిలో నడిచే ప్రసక్తే లేదన్నారు. అసలు టీడీపీలోకి వచ్చింది అవతలి వారన్నవిషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News