బ్రహ్మోత్సవంపై ఓ రేంజ్‌లో వర్మ సెటైర్లు

విడుదలైన మొదటి షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న బ్రహ్మోత్సంపై దర్శకుడు వర్మ గట్టిగా ట్వీట్ చేశారు. ఇకపై ఫ్యామిలీ సినిమాలు తీయాలంటేనే దర్శక నిర్మాతలు భయపడుతారని అన్నారు. కొద్దికాలం పాటు ఫ్యామిలీ సినిమాలు ఇక రావని వర్మ అభిప్రాయపడ్డారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు మహేష్‌ నుంచి పోకరి, ఒక్కడు, బిజినెస్‌మేన్ చూడాలనుకుంటారని అన్నారు. బ్రహ్మోత్సంలో మహేష్ చేసిన డ్యాన్స్‌పైనా వర్మ సెటైర్లు వేశారు. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ డ్యాన్స్ వీడియోను ట్వీట్‌ చేసిన వర్మ…  అంతర్జాతీయ డ్యాన్సర్లు సేవియన్ […]

Advertisement
Update: 2016-05-21 23:44 GMT

విడుదలైన మొదటి షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న బ్రహ్మోత్సంపై దర్శకుడు వర్మ గట్టిగా ట్వీట్ చేశారు. ఇకపై ఫ్యామిలీ సినిమాలు తీయాలంటేనే దర్శక నిర్మాతలు భయపడుతారని అన్నారు. కొద్దికాలం పాటు ఫ్యామిలీ సినిమాలు ఇక రావని వర్మ అభిప్రాయపడ్డారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు మహేష్‌ నుంచి పోకరి, ఒక్కడు, బిజినెస్‌మేన్ చూడాలనుకుంటారని అన్నారు. బ్రహ్మోత్సంలో మహేష్ చేసిన డ్యాన్స్‌పైనా వర్మ సెటైర్లు వేశారు. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ డ్యాన్స్ వీడియోను ట్వీట్‌ చేసిన వర్మ… అంతర్జాతీయ డ్యాన్సర్లు సేవియన్ గ్లోవర్, మార్తా గ్రాహం, జార్జ్ లాంటి వారు, ఈ డ్యాన్స్ చూసి నేర్చుకోవాలి అంటూ పంచ్ వేశాడు.

ఫ్యామిలీ సినిమాను ఒక కుటుంబంలోని సభ్యులు ఎలా చూస్తారో కూడా తన స్టైల్‌లో వివరించాడు వర్మ. ‘ కుటుంబ కథా చిత్రానికి వెళ్తే.. తండ్రి హీరోయిన్ అందం చూస్తాడు. తల్లి వాళ్ల దుస్తులను చూస్తుంది. కూతురు బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తుంది. కొడుకు నిద్రపోతాడు. ఈ విషయాన్ని మిస్టర్ ఎమ్ తెలుసుకోవాలి” అని అన్నాడు. ”శోభన్ బాబు లాంటి స్టార్లు మాత్రమే ఫ్యామిలీ సినిమాలు చేస్తారు. కృష్ణ, ఎన్టీఆర్లు కాదు. నాకు శోభన్ బాబు చేసిన దేవత సినిమా గుర్తుంది కానీ హీరో గుర్తులేడు. కానీ కృష్ణ, ఎన్టీఆర్ల సినిమాల స్టోరి గుర్తు లేదు. వాళ్లే గుర్తున్నారు. మిస్టర్ ఎమ్ స్టార్ డమ్ గురించి తెలుసుకో’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ రేంజ్‌లో మహేష్‌ను వర్మ విమర్శించినప్పటికీ ప్రిన్స్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఓ పది గంటల పాటు ఆగి తర్వాత మరో ట్వీట్ పెట్టాడు వర్మ. తన కామెంట్స్ ను హేష్‌ ఫ్యాన్స్ పాజిటివ్ గా తీసుకున్నందుకు చాలా హ్యాపీ అనిఅన్నాడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News