కాంగ్రెస్ బ‌తికి ఉన్న రాష్ట్రాలు, వాటి జ‌నాభా అంతా క‌లిపినా...

ఒక‌ప్పుడు కింగ్‌లా దేశాన్ని ఏలిక కాంగ్రెస్ ఇప్పుడు అడ్ర‌స్ వెతుక్కుంటోంది. ఐదేళ్ల కాలంలో శ‌ర‌వేగంగా ప‌త‌నం అవుతూ అనేక రాష్ట్రాల‌ను కోల్పోయింది. 2011లో కాంగ్రెస్ 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. మ‌రో రెండు చోట్ల దాని మిత్ర పార్టీలు అధికారంలో ఉండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి తారుమారైంది. దేశంలో కేవ‌లం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో మిగిలి ఉంది. ఆ ఆరు రాష్ట్రాల్లోనూ ఒక్క క‌ర్నాట‌క మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ రాష్ట్రం. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ఏఒక్క […]

Advertisement
Update: 2016-05-20 05:14 GMT

ఒక‌ప్పుడు కింగ్‌లా దేశాన్ని ఏలిక కాంగ్రెస్ ఇప్పుడు అడ్ర‌స్ వెతుక్కుంటోంది. ఐదేళ్ల కాలంలో శ‌ర‌వేగంగా ప‌త‌నం అవుతూ అనేక రాష్ట్రాల‌ను కోల్పోయింది. 2011లో కాంగ్రెస్ 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. మ‌రో రెండు చోట్ల దాని మిత్ర పార్టీలు అధికారంలో ఉండేవి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి తారుమారైంది. దేశంలో కేవ‌లం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో మిగిలి ఉంది.

ఆ ఆరు రాష్ట్రాల్లోనూ ఒక్క క‌ర్నాట‌క మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ రాష్ట్రం. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ఏఒక్క దాని జ‌నాభా కూడా దేశ జ‌నాభాలో ఒక‌శాతం కూడా లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిజోరాం, మ‌ణిపూర్, మేఘాల‌యాలు చాలా చిన్న రాష్ట్రాలు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్‌లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల జ‌నాభా … మొత్తం దేశ‌జ‌నాభాలో కేవ‌లం 7.01 శాతం మాత్ర‌మే . దీన్ని బ‌ట్టే కాంగ్రెస్ దేశంలో ప్ర‌స్తుతం ఏ స్థాయిలో ప‌త‌న‌మైందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు 12 రాష్ట్రాల్లో అధికారం చ‌లాయిస్తున్నాయి.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల జ‌నాభా శాతాన్ని దేశ జ‌నాభాతో పోల్చి చూస్తే క‌ర్నాట‌క జ‌నాభా 5.05 శాతం, మిజోరాం 0.09, మ‌ణిపూర్ 0.22, ఉత్త‌రాఖండ్ 0.84, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ 0.57శాతం మాత్ర‌మే. కంచుకోట‌లా ఉన్న ఆంధ్ర‌ప‌దేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవ‌డం కూడా కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బ‌తీసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News