ప‌రారీలో ఎమ్మెల్యే అత్తార్ బాషా

ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఫిరాయింపుదారులకు పాత టీడీపీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క‌దిరిలో నిర్వహించిన మినీమహానాడుకు కూడా ఆయన రాలేకపోతున్నారు. మినీ మహానాడుకు రావాలని అత్తార్ అనుకున్నప్పటికీ టీడీపీ నేతల నుంచి వచ్చిన వార్నింగ్‌తో ఆయ‌న క‌నిపించ‌కుండా పోయారు. మ‌హానాడుకు వ‌స్తే ఎమ్మెల్యేను బ‌ట్ట‌లూడ‌దీసి కొడుతామ‌ని టీడీపీకి చెందిన జిల్లా ఇన్‌చార్జ్ కందికుంట […]

Advertisement
Update: 2016-05-19 01:25 GMT

ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఫిరాయింపుదారులకు పాత టీడీపీ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క‌దిరిలో నిర్వహించిన మినీమహానాడుకు కూడా ఆయన రాలేకపోతున్నారు. మినీ మహానాడుకు రావాలని అత్తార్ అనుకున్నప్పటికీ టీడీపీ నేతల నుంచి వచ్చిన వార్నింగ్‌తో ఆయ‌న క‌నిపించ‌కుండా పోయారు. మ‌హానాడుకు వ‌స్తే ఎమ్మెల్యేను బ‌ట్ట‌లూడ‌దీసి కొడుతామ‌ని టీడీపీకి చెందిన జిల్లా ఇన్‌చార్జ్ కందికుంట ప్ర‌సాద్ వ‌ర్గీయులు హెచ్చ‌రించ‌డంతోనే అత్తార్ మినీ మ‌హానాడుకు దూరంగా ఉండిపోయార‌ని చెబుతున్నారు. లోక‌ల్‌లోనే ఉండి మినీ మ‌హానాడుకు హాజ‌రుకాక‌పోతే త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌న్న ఉద్దేశంతో ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్లిపోయార‌ని స‌మాచారం.

ఆయ‌న అనుచ‌రులు కూడా భౌతిక దాడుల‌కు భ‌య‌ప‌డి మినిమహానాడు ప‌రిస‌రాల్లోకి రాలేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలోనూ చాంద్‌బాషాకు ఎమ్మెల్సీ ప‌య్యావుల నుంచి సెటైర్లు ప‌డ్డాయి. తాము ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండి పోరాటం చేసి అధికారంలోకి వ‌చ్చాం. కానీ కొందరు ఎమ్మెల్యేలు రెండేళ్లు కూడా ప్ర‌తిప‌క్షంలో ఉండ‌లేక టీడీపీలోకి వ‌చ్చేస్తున్నారంటూ చాంద్ బాషాను ఉద్దేశించి చుర‌క‌లంటించారు ప‌య్యావుల. ఇలా టీడీపీ నేత‌ల చేతిలో ప‌దేప‌దే అవ‌మానాలు భ‌రిస్తూ అత్తార్ చాంద్ బాషా కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించ‌డంతో మినిమహానాడుకు కూడా హాజ‌రుకాకుండా చాంద్ బాషా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News