వ్యవస్థకు వైసీపీ పరీక్ష

పెరుగుట విరుగుటకే అన్నది చాలాసార్లు నిజమైంది. వ్యవస్థలోని లోపాలను అలుసుగా తీసుకుని కొన్ని శక్తులు పేట్రేగిపోయినప్పుడు… ఆ బరితెగింపు పతాక స్థాయికి చేరినప్పుడు వ్యవస్థలో అందుకు విరుగుడుగా మార్పులు జరుగుతూ వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల అంశం కూడా అలాంటిదే. గతంలో ఇష్టానుసారం ప్రజాప్రతినిధులు గోడలు దూకి ఓటేసిన ఓటరును పిచ్చివాళ్లను చేసి ఆడించారు. దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు వచ్చాయి. అయితే రంగుమార్చిన ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. ఇదే ఇప్పుడు ఫిరాయింపుల […]

Advertisement
Update: 2016-05-13 10:02 GMT

పెరుగుట విరుగుటకే అన్నది చాలాసార్లు నిజమైంది. వ్యవస్థలోని లోపాలను అలుసుగా తీసుకుని కొన్ని శక్తులు పేట్రేగిపోయినప్పుడు… ఆ బరితెగింపు పతాక స్థాయికి చేరినప్పుడు వ్యవస్థలో అందుకు విరుగుడుగా మార్పులు జరుగుతూ వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల అంశం కూడా అలాంటిదే. గతంలో ఇష్టానుసారం ప్రజాప్రతినిధులు గోడలు దూకి ఓటేసిన ఓటరును పిచ్చివాళ్లను చేసి ఆడించారు. దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు వచ్చాయి. అయితే రంగుమార్చిన ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. ఇదే ఇప్పుడు ఫిరాయింపుల చట్టానికి పెద్ద బొక్కలా తయారైంది. స్పీకర్లు అధికార పార్టీకి తొత్తులుగా కాకుండా ఇంటి పెద్దగా వ్యవహరించే కాలం చెల్లి చాలా కాలమే అయింది. దీంతో ఫిరాయింపుదారుల బరితెగింపులకు స్పీకర్‌ వ్యవస్థ రక్షణ కవచంలా తయారైందన్న భావన ఏర్పడింది.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుల పర్వం ఆ తరహాలోనే ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌పై ఆశలు వదిలేసుకున్న వైసీపీ… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంను ఆశ్రయించింది. స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదని జోక్యంచేసుకుని వెంటనే అనర్హత వేటు వేయాలని కోరింది. ఇక్కడే ఇప్పుడు న్యాయవ్యవస్థ బలమెంతో తేలే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ సొంతంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయా లేక శాసన వ్యవస్థదే పై చేయిగా ఉందా అన్నది తేలే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు పబ్లిక్‌ గా అందరూ చూస్తుండగానే, కలెక్టర్లు సభకు అవసరమైన ఏర్పాట్లు చేయగా సీఎం సమక్షంలో పార్టీ ఫిరాయించారు. నిజంగా ఈ దేశంలో ధర్మం, న్యాయం, రాజ్యాంగం అన్నవి బతికి ఉంటే ఇంత పబ్లిక్‌గా ప్రజలేసిన ఓటుకు ఉరి వేసిన ఎమ్మెల్యేలపై వేటు పడాలి. అనర్హత వేటు వేసే అధికారం ప్రస్తుతం స్పీకర్ చేతిలో ఉండవచ్చు. కానీ స్పీకర్ల తీరు ఎలా ఉందో జగమెరిగిన రహస్యమే. కాబట్టి ఇప్పుడు న్యాయాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాల్సింది న్యాయస్థానాలే.

పట్టపగలు ఇలా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా కూడా ఫిరాయింపుదారులపై తాముచర్యలు తీసుకోమన్న తీర్పు కోర్టుల నుంచి వస్తే ఇక రాజ్యాంగంపై నేతల చేత ప్రమాణంచేయించడం కూడా వృథాయే. ఐపీఎల్ తరహాలోనే ప్రజాప్రతినిధులను వేలం పాటలో కొనుక్కోవడాన్ని చట్టబద్దం చేయడం బెటర్. కోర్టుల్లో న్యాయమూర్తుల కొరత ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటతడి పెట్టినప్పుడు దేశం మొత్తం దిగాలుపడిపోయింది. న్యాయవ్యవస్థకు సానుభూతి ప్రకటించింది. ఆ సానుభూతి నిలబడాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ కోర్టులు గట్టిగా వ్యవహరించి దేశ ప్రజల మెప్పు పొందాల్సి ఉంటుంది. లేనిపక్షంలో జనం కూడా ఏ వ్యవస్థపైనా సానుభూతి చూపే పరిస్థితి ఉండదు. ఆ అవసరం కూడా లేదన్న అసహనం ఆరంభమయ్యే అవకాశం ఉంది.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News