లెస్బియ‌న్ల తరహాలో బతికేవారిమి -సోనా చౌద‌రి

జాతీయ పుట్ బాల్ జ‌ట్టు మాజీ స‌భ్యురాలు సోనా చౌద‌రి సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టారు. జ‌ట్టులో ఉన్న స‌మ‌యంలో తాను చూసిన‌, ఎదుర్కొన్న విష‌యాల‌ను ఆమె పుస్త‌క రూపంలో వెల్ల‌డించారు. కోచ్‌లు, సెలెక్ట‌ర్లు త‌మ‌ను లైంగికంగా ఎలా వేధించింది వివ‌రించారు. గేమ్ ఇన్ గేమ్ పేరుతో ఈ పుస్తకాన్ని ర‌చించార‌మె. వార‌ణాసిలో దీన్ని విడుద‌ల చేశారు. టీమ్‌ మేనేజ్‌మెంట్, కోచ్‌, సెక్రటరీ ఇలా ప్రతి ఒక్కరూ తమను లైంగిక వేధించేవారని పుస్త‌కంలో వివ‌రించింది చౌద‌రి. త‌న‌తో పాటు […]

Advertisement
Update: 2016-05-12 06:25 GMT

జాతీయ పుట్ బాల్ జ‌ట్టు మాజీ స‌భ్యురాలు సోనా చౌద‌రి సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌పెట్టారు. జ‌ట్టులో ఉన్న స‌మ‌యంలో తాను చూసిన‌, ఎదుర్కొన్న విష‌యాల‌ను ఆమె పుస్త‌క రూపంలో వెల్ల‌డించారు. కోచ్‌లు, సెలెక్ట‌ర్లు త‌మ‌ను లైంగికంగా ఎలా వేధించింది వివ‌రించారు. గేమ్ ఇన్ గేమ్ పేరుతో ఈ పుస్తకాన్ని ర‌చించార‌మె. వార‌ణాసిలో దీన్ని విడుద‌ల చేశారు.

టీమ్‌ మేనేజ్‌మెంట్, కోచ్‌, సెక్రటరీ ఇలా ప్రతి ఒక్కరూ తమను లైంగిక వేధించేవారని పుస్త‌కంలో వివ‌రించింది చౌద‌రి. త‌న‌తో పాటు జ‌ట్టులోని ఇత‌ర అమ్మాయిల‌ను వేధించేవార‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి క్రీడాకార‌ణిని లైంగికంగా వేధించేవార‌ని లోబ‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నించేవార‌ని చెప్పింది. లొంగ‌ని వారిపై క‌క్ష క‌ట్టేవార‌ని పుస్త‌కంలో వివ‌రించింది. ఈ లైంగిక వేధింపులు దిన‌చ‌ర్య‌లో భాగంగా ఉండేవ‌న్నారు. చివ‌ర‌కు తాము లైంగిక వేధింపుల నుంచి త‌ప్పించుకునేందుకు లెస్బియ‌న్ల త‌ర‌హాలో ప్ర‌వ‌ర్తించేవారిమ‌ని ఆమె వివ‌రించారు.
ఒక్క జాతీయ జట్టులో మాత్రమే కాదు.. రాష్ట్రస్థాయిలోనూ, ఇతర స్థాయిల్లోనూ మహిళా ఆటగాళ్లపై లైంగిక వేధింపులు జరిగేవని, అలాంటివాటికి రాజీపడలేక వారు మానసిక క్షోభకు గురయ్యేవారమంది.విదేశీ పర్యటనల్లో కోచ్‌లు, స్టాఫ్‌ సభ్యుల బెడ్‌ల‌ను మ‌హిళా ఆట‌గాళ్ల గ‌దుల్లోనే ఏర్పాటు చేసేవార‌ని చెప్పింది. ఫిర్యాదులు చేసినా ఫ‌లితం ఉండేది కాద‌న్నారు. 1998లో ఆసియా కప్‌ మ్యాచ్‌ సందర్భంగా సోనా చౌదరి మోకాలికి, వెన్నెముకకు గాయమైంది. దీంతో ఆమె కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News