"ఈడ మాట్లాడుతున్నది వేణుమాధవా వాడి బామ్మర్ధా?"

కమిడియన్‌ వేణుమాధవుకి రాకూడని కష్టాలే వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు వేణుమాధవు జీవితంతోనే స్టోరీలు అల్లేశాయి. వేణుమాధవుకి తీవ్రమైన జబ్బు వుందని కథనాలు ప్రచారంచేశాయి. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ కథనాన్ని ప్రచారం చేసింది. మరో అడుగు ముందుకేసి వేణుమాధవ్‌ ఇక లేరంటూ హెడ్‌లైన్‌ పెట్టెసింది. ఆయన చివరిసారిగా నిమ్స్‌ ఆసుపత్రిలోనే మాట్లాడాడంటూ స్టోరీని వదిలింది. దీనిపై వేణుమాధవ్‌ చాలా సీరియస్‌గా స్పందించారు. కుషాయిగూడా పోలీస్‌స్టేషన్‌లో టీవి ఛానల్‌తోపాటు కొన్ని వెబ్‌సైట్లమీద ఫిర్యాదు చేశారు. ఈ […]

Advertisement
Update: 2016-05-10 09:08 GMT

కమిడియన్‌ వేణుమాధవుకి రాకూడని కష్టాలే వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు వేణుమాధవు జీవితంతోనే స్టోరీలు అల్లేశాయి. వేణుమాధవుకి తీవ్రమైన జబ్బు వుందని కథనాలు ప్రచారంచేశాయి. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ కథనాన్ని ప్రచారం చేసింది. మరో అడుగు ముందుకేసి వేణుమాధవ్‌ ఇక లేరంటూ హెడ్‌లైన్‌ పెట్టెసింది. ఆయన చివరిసారిగా నిమ్స్‌ ఆసుపత్రిలోనే మాట్లాడాడంటూ స్టోరీని వదిలింది. దీనిపై వేణుమాధవ్‌ చాలా సీరియస్‌గా స్పందించారు. కుషాయిగూడా పోలీస్‌స్టేషన్‌లో టీవి ఛానల్‌తోపాటు కొన్ని వెబ్‌సైట్లమీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వేణుమాధవ్‌ మీడియా తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

ఆయన ఏమన్నారంటే “కొందరు నాకు క్యాన్సర్‌ వుందని అందుకే గుండు చేయించుకున్నానని అంటున్నారు. నేను తిరుపతి వెళ్లి గుండు చేయించుకున్నా, అందుకు సంబంధించిన ఫొటో సాక్ష్యాం ఇదిగో, నేను అభిమానించే హీరోలు చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100 సినిమా సూపర్‌హిట్‌ కావాలని ఆ భగవంతున్ని కోరుకోవడానికి తిరుపతికి వచ్చాను, దానికి సంబంధించిన ఫొటో సాక్ష్యం ఇదిగో” అంటూ మీడియాకి చూపించారు.

తనకు లేని జబ్బులను చూపుతూ వెబ్‌మీడియాలో రాసిన కథనాలను చూపించారు వేణుమాధవ్‌. కథనాలకు చదివి వినిపించారు. “గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్‌ ఇక మనకు లేడు, చివరిసారిగా నిమ్స్‌ హాస్పటల్‌లో మాట్లాడిన వేణుమాదవ్‌” అని చదివి వినిపించారు. “వేణుమాధవ్‌ చనిపోయివుంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది వేణుమాధవా లేక వాడి తమ్ముడా లేక వాడి బామ్మర్ధా” అని మండిపడ్డారు. ఇటువంటి దుష్పప్రచారాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలుసుకోవడానికే అలా ప్రచారంచేసిన మీడియా మీద, వెబ్‌సైట్ మీద కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలియజేశారు.ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని పోలీస్‌ కమీషనర్‌కి, హోం మినిస్టర్ కి‌, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు వేణుమాధవ్‌.

https://youtu.be/jh3P75Vh60c

click on Image to Read:

Tags:    
Advertisement

Similar News