దేవిరెడ్డి మృతిపై వీడిన మిస్టరీ.. గొడవ పడి 130 కి.మీ వేగంతో ఢీకొట్టాడు

హైదరాబాద్ జూబ్లిహిల్స్ కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన దేవిరెడ్డి  మృతి కేసుపై పోలీసుల ఒక నిర్ధారణకు వచ్చారు. నిందితులను సుధీర్ఘంగా విచారించిన పోలీసులు అనేక విషయాలు రాబట్టారు. ప్రమాదంపై దేవి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపించారు. కారు ప్రమాదంపై మోటార్ వెహికల్ డిపార్ట్ మెంట్ అధికారులతోనూ విచారణ జరిపించారు. మొత్తం ఐదు నివేదికలు కమిషనర్ కు అందాయి. పోస్టుమార్టంలో దేవి రోడ్డు ప్రమాదంలోమృతి  చెందినట్టు తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో […]

Advertisement
Update: 2016-05-06 10:59 GMT

హైదరాబాద్ జూబ్లిహిల్స్ కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన దేవిరెడ్డి మృతి కేసుపై పోలీసుల ఒక నిర్ధారణకు వచ్చారు. నిందితులను సుధీర్ఘంగా విచారించిన పోలీసులు అనేక విషయాలు రాబట్టారు. ప్రమాదంపై దేవి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపించారు. కారు ప్రమాదంపై మోటార్ వెహికల్ డిపార్ట్ మెంట్ అధికారులతోనూ విచారణ జరిపించారు. మొత్తం ఐదు నివేదికలు కమిషనర్ కు అందాయి.

పోస్టుమార్టంలో దేవి రోడ్డు ప్రమాదంలోమృతి చెందినట్టు తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన భరత్ సింహారెడ్డితో పాటు అతడి స్నేహితులను పోలీసులు విచారించగా కొత్త విషయం చెప్పారు. దేవి ఇంటికి సమీపంలోనే భరత్ కు ఆమెకు మధ్య వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. తనతో దేవి గొడవపడడంతో భరత్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న భరత్ కోపంతో కారును గంటకు 130 కి.మీ వేగంతో నడిపాడు. ఈ సమయంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దగ్గరదగ్గరే ఉన్న రెండు చెట్లను కారు ఢీకొన్నట్టు తేల్చారు. దేవి కూర్చున్న వైపు కారు గట్టిగా చెట్టును ఢీకొట్టడంతో ఆమె తలకు బలమైన గాయమైందని వైద్యులు తేల్చారు. పక్కటెముకలు కూడా విరిగాయి. ఎయిర్ బ్యాగ్ కూడా ప్రమాదధాటికి పగిలిపోయిందని చెబుతున్నారు. భరత్ వైపు ఎయిర్ బ్యాగ్ సేఫ్ గా ఓపెన్ కావడంతో అతడు బతికిపోయాడు.

భరత్ సింహారెడ్డి, దేవి మధ్య గొడవెందుకు జరిగిందన్నది మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. ఆదివారం పోలీస్ కమిషన్ మీడియాకు పూర్తి వివరాలు తెలియజేస్తారని చెబుతున్నారు. దేవి కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటికీ పోలీసులు చెబుతున్న విషయాలను నమ్మడం లేదు. సమగ్రవిచారణ కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు.

click to read-

Tags:    
Advertisement

Similar News