తూ. గో జిల్లాలో జగన్ ధర్నా- స్టేట్ స్తంభించాలంటున్న వైసీపీ

ప్రత్యేకహోదా ఏపీకి ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పిన నేపథ్యంలో పోరాటం ఉధృతం చేయాలని  వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 10న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.  చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు.  పక్కన ఉన్న తమిళనాడును చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయం […]

Advertisement
Update: 2016-05-05 01:45 GMT

ప్రత్యేకహోదా ఏపీకి ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పిన నేపథ్యంలో పోరాటం ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 10న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు. పక్కన ఉన్న తమిళనాడును చూసి చంద్రబాబు నేర్చుకోవాలన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో అన్నింటిని స్తంభింపచేసేలా ఉద్యమం చేయాలన్నారు. రెండు మూడు రోజుల పాటు రైళ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపచేస్తేనే కేంద్రం దిగి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిన తర్వాత కూడా టీడీపీ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు, చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ను టీడీపీ ఎంపీలు ఎందుకు స్తంభింపచేయడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ప్రకటన వచ్చి 24 గంటలు గడుస్తున్నా టీడీపీ నుంచి అధికారిక ప్రకటన ఎందుకు వెలువడం లేదని నిలదీశారు. చంద్రబాబు ఢిల్లీలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసులకు భయపడే చంద్రబాబు నోరు మెదపడం లేదని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు రెండేళ్ల క్రితం ఏమి చెప్పారో ఇప్పుడు అదే మాటలు చెబుతున్నారని విమర్శించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News