బాబు ప్లాన్ అర్థం కాక అద్భుతమైన ఐడియా ఇచ్చిన తమ్ముళ్లు

చంద్రబాబు తను పడుతున్న కష్టాలను చెప్పుకున్నప్పుడు టీడీపీ నేతలు కొందరు తట్టుకోలేకపోతున్నారు. అయితే వారిలో సీనియర్లు కాకుండా చంద్రబాబు గురించి పూర్తిగా తెలియని జూనియర్లే ఉంటున్నారు. మనవడితో ఆడుకోవాలని ఉన్నా సమయం ఉండడం లేదని చంద్రబాబు చెప్పినప్పుడు టీడీపీ నేతలు కన్నీరుపెట్టుకున్నంత పని చేశారు. తమ నేత కష్టాలు, కోరికలు తీరే దారే లేదా అని కొందరు ధీర్ఘంగా ఆలోచన చేసి ఒక అద్భుతమైన ఐడియాను చంద్రబాబు చెవిలో వేసేందుకు సిద్ధపడ్డారు. కుటుంబసభ్యులు, మనవడు అందరూ అందుబాటులో ఉంటే చంద్రబాబు […]

Advertisement
Update: 2016-05-04 00:34 GMT

చంద్రబాబు తను పడుతున్న కష్టాలను చెప్పుకున్నప్పుడు టీడీపీ నేతలు కొందరు తట్టుకోలేకపోతున్నారు. అయితే వారిలో సీనియర్లు కాకుండా చంద్రబాబు గురించి పూర్తిగా తెలియని జూనియర్లే ఉంటున్నారు. మనవడితో ఆడుకోవాలని ఉన్నా సమయం ఉండడం లేదని చంద్రబాబు చెప్పినప్పుడు టీడీపీ నేతలు కన్నీరుపెట్టుకున్నంత పని చేశారు. తమ నేత కష్టాలు, కోరికలు తీరే దారే లేదా అని కొందరు ధీర్ఘంగా ఆలోచన చేసి ఒక అద్భుతమైన ఐడియాను చంద్రబాబు చెవిలో వేసేందుకు సిద్ధపడ్డారు.

కుటుంబసభ్యులు, మనవడు అందరూ అందుబాటులో ఉంటే చంద్రబాబు మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్న ఉద్దేశంతో కొందరు నేతలు తమ ఐడియాను చంద్రబాబు సన్నిహితుల చెవిలో వేశారట. అదేంటంటే అసలు చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లో ఉండాల్సినంత అవసరం ఏముంది. విజయవాడలోనే ఒక మంచి అద్దె ఇల్లు చూసి ఇక్కడే కాపురం పెడితే బాగుంటుందని చెప్పారట. హెరిటేజ్ వ్యవహారాలను కావాంటే విజయవాడ నుంచే పర్యవేక్షించే అవకాశం ఉంటుందంటున్నారు. అప్పుడు ఇలా పదేపదే మనవడి కోసం సీఎం బాధపడడం, దాన్ని చూసి తాము ఆవేదన చెందడం వంటి ఇబ్బందులు ఉండవని సూచించారు.

ఈ ఐడియా సీఎం వరకు వెళ్లిందో లేదో గానీ… సీనియర్లు మాత్రం ఈ ఐడియాలు చూసి నవ్వుకున్నారట. ఎన్నో ఎత్తులు వేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న చంద్రబాబు.. ఇలా పదేపదే మనవడి సెంటిమెంట్ గుర్తు చేస్తున్నారంటే కారణం… జనాల్లో సింపతి కొట్టేయడానికేనని సీనియర్లు జూనియర్లకు హితబోధ చేశారట. ఇప్పుడు వెళ్లి ఫ్యామిలీని విజయవాడకు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఐడియా ఇచ్చినా… ఆ తర్వాత అది జనంలోకి బాగా వెళ్తే జనం కూడా నిజమే ఫ్యామిలీ విజయవాడ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. అదే జరిగితే మరోసారి మనవడి సెంటిమెంట్ ప్రయోగించి జనాన్ని బురిడికొట్టే అవకాశం మిస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఐడియా ఇవ్వడం మానుకుని పనిచేసుకోండి అని సూచించారట.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News