జ‌గ‌న్ " టీఆర్ ఎస్‌పై రేవంత్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఎక్క‌డైనా బావ గానీ, వంగ తోట కాదు అంటారు పెద్ద‌లు.. ఎంత స్నేహం ఉన్నా.. ఎవ‌రి హ‌ద్దుల్లో వారుండాల‌న్న‌ది ఈ సామెత‌లో నీతి. ఎంత పొత్తు ధ‌ర్మం పాటించిన‌ప్ప‌టికీ, ఎంత స‌న్నిహితంగా మెలిగిన‌ప్పటికి త‌న ఉనికిని కోల్పేయే మూర్ఖ‌పుప‌ని ఏ రాజ‌కీయ‌ పార్టీ చేయ‌దు. కానీ, తెలంగాణ‌లో వైసీపీ ఆ ప‌నికే పూనుకుంద‌ని రేవంత్ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశారు. పాల‌మూరు ప్రాజెక్టు విష‌యంలో హ‌రీశ్ వ్యాఖ్యలకు – జ‌గ‌న్ జ‌ల‌దీక్ష చేస్తున్నార‌ని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి […]

Advertisement
Update: 2016-05-03 01:50 GMT

ఎక్క‌డైనా బావ గానీ, వంగ తోట కాదు అంటారు పెద్ద‌లు.. ఎంత స్నేహం ఉన్నా.. ఎవ‌రి హ‌ద్దుల్లో వారుండాల‌న్న‌ది ఈ సామెత‌లో నీతి. ఎంత పొత్తు ధ‌ర్మం పాటించిన‌ప్ప‌టికీ, ఎంత స‌న్నిహితంగా మెలిగిన‌ప్పటికి త‌న ఉనికిని కోల్పేయే మూర్ఖ‌పుప‌ని ఏ రాజ‌కీయ‌ పార్టీ చేయ‌దు. కానీ, తెలంగాణ‌లో వైసీపీ ఆ ప‌నికే పూనుకుంద‌ని రేవంత్ వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశారు. పాల‌మూరు ప్రాజెక్టు విష‌యంలో హ‌రీశ్ వ్యాఖ్యలకు – జ‌గ‌న్ జ‌ల‌దీక్ష చేస్తున్నార‌ని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. అక్క‌డితో రేవంత్ ఆగ‌లేదు. జ‌గ‌న్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకున్నందుకు ప్ర‌తిఫ‌లంగా రూ.10 వేల‌కోట్ల ప్రాజెక్టులను అధికార పార్టీ క‌ట్టబెట్టిందని ఆరోపించారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరుతుంటే అభ్యంత‌రం చెబుతున్న జ‌గ‌న్ దీనిపై ఎందుకు మాట్లాడ‌టం లేదని రేవంత్ ప్రశ్నించారు.

మండిప‌డుతున్న గులాబీ, వైసీపీ నేత‌లు
ఈ వ్యాఖ్య‌ల‌పై రెండుపార్టీల నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్స‌హించ‌డంపై వైసీపీ మొద‌టి నుంచి వ్య‌తిరేకంగానే ఉందని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. ఏప్రిల్ మూడో వారంలో పొంగులేటి పార్టీ మార‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. వెంట‌నే పొంగులేటి జ‌గ‌న్‌తో అలాంటిదేమీ లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. కానీ, ఆఖ‌రు నిమిషంలో పొంగులేటి కారెక్కారు. అదే స‌మ‌యంలో వేలాదికోట్ల రూపాయ‌లు ప‌నులు పొంగులేటికిచ్చి జ‌గ‌న్ తో డ్రామాలు ఆడాల్సిన అవ‌స‌రం మాకేంట‌ని గులాబీనేత‌లు గుస్సాఅవుతున్నారు. ఏపీలో చంద్ర‌బాబు చేస్తోన్న విధంగా తెలంగాణ‌లో మాకు చేయాల్సిన అవ‌స‌రం లేదని వారు స్ప‌ష్టం చేశారు. ఓటుకు నోటు కేసు స‌మ‌యంలో బ‌య‌టికి వ‌చ్చిన వీడియోల్లో ఎవ‌రు డ‌బ్బులిచ్చి ప్ర‌లోభపెట్టారో జ‌గ‌మంతా చూసింద‌ని ఎద్దేవా చేస్తున్నారు గులాబీ నేత‌లు. ప‌చ్చ కామెర్ల వాడికి లోక‌మంతా ప‌చ్చ‌గానే క‌నిపిస్తుంద‌న్న చందంగా తాము ఏపీలో చేస్తున్న‌దే లోక‌మంతా చేస్తార‌నుకోవ‌డం టీడీపీ అవివేక‌మ‌ని అంటున్నారు టీఆర్ ఎస్ నేత‌లు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News