దాసరి నారాయణకు బిగుస్తున్న ఉచ్చు

బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణకు చిక్కులు తప్పేలా లేవు.  ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.  దాసరితో పాటు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌, మరో 13మందిపై అభియోగాల నమోదుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాసరి నారాయణరావు యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కోల్ స్కాం జరిగింది. అక్రమంగా జిందాల్ కంపెనీకి బొగ్గు గనులు కేటాయించినట్టు […]

Advertisement
Update: 2016-04-29 02:20 GMT

బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణకు చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. దాసరితో పాటు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌, మరో 13మందిపై అభియోగాల నమోదుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దాసరి నారాయణరావు యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కోల్ స్కాం జరిగింది. అక్రమంగా జిందాల్ కంపెనీకి బొగ్గు గనులు కేటాయించినట్టు సీబీఐ తేల్చింది. అయితే అప్పట్లో బొగ్గు శాఖను నేరుగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే పర్యవేక్షించేవారని… తనకు ఎలాంటి సంబంధం లేదని దాసరి చెబుతూ వచ్చారు. కానీ దాసరి ప్రమేయంపైనా సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించింది. జిందాల్ కంపెనీ నుంచి దాసరికి చెందిన మీడియా సంస్థలోకి రెండు కోట్ల రూపాయలు బదిలీ అయినట్టు సీబీఐ గుర్తించింది. ఇది క్విడ్‌ప్రోకోలో భాగంగానే జరిగిందని సీబీఐ అభియోగం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News