చూడ్డానికి స్వామిలా ఉంటాడు… పెద్ద కంత్రీ

ఆదిమూలం మోహన్‌. తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్. చూడ్డాలనికి చాలా డీసెంట్‌గా ఉంటారు. బొట్టుపెట్టుకుని ధర్మాన్ని నమ్ముకుని బతుకుతున్న వాడిని అనిపిస్తాడు. కానీ తెరవెనుక చేసేది మాత్రం అధర్మంగా దోచేయడమే. ఈయన బాగోతంపై చాలా ఫిర్యాదులు రావడంతో గురువారం ఏసీబీ మూకుమ్మడిగా ఆయన ఆస్తులపై దాడులు చేసింది. దీంతో దిమ్మతిరిగే స్థాయిలో ఆస్తులు బయటపడ్డాయి.  ఏకంగా వంద కోట్లు సంపాదించేశారు ఆదిమూలం. కాకినాడలోని ఆయన ఇంటితో సహా ఏపీ, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం […]

Advertisement
Update: 2016-04-28 22:57 GMT

ఆదిమూలం మోహన్‌. తూర్పుగోదావరి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్. చూడ్డాలనికి చాలా డీసెంట్‌గా ఉంటారు. బొట్టుపెట్టుకుని ధర్మాన్ని నమ్ముకుని బతుకుతున్న వాడిని అనిపిస్తాడు. కానీ తెరవెనుక చేసేది మాత్రం అధర్మంగా దోచేయడమే. ఈయన బాగోతంపై చాలా ఫిర్యాదులు రావడంతో గురువారం ఏసీబీ మూకుమ్మడిగా ఆయన ఆస్తులపై దాడులు చేసింది. దీంతో దిమ్మతిరిగే స్థాయిలో ఆస్తులు బయటపడ్డాయి. ఏకంగా వంద కోట్లు సంపాదించేశారు ఆదిమూలం.

కాకినాడలోని ఆయన ఇంటితో సహా ఏపీ, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 9 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భారీగా నగదు, బంగారం, వెండి వస్తువులు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించారు.

హైదరాబాద్ కొంపల్లిలో 8 ప్లాట్లు, మాదాపూర్‌లో 4 ప్లాట్లు, జూబ్లీహిల్స్‌లో 4 అంతస్తుల అపార్టుమెంట్, విజయవాడలో కూతురి పేర ఇల్లు, అల్లుడి పేరుతో మరో రెండు ఇళ్లు, ప్రకాశం జిల్లాలో 45 ఎకరాల భూమి, చిత్తూరులో 9 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు.

చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్, బళ్లారిలో పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.150 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదు పరిశ్రమలు కూడా ఉన్నట్టు డాక్యుమెంట్లు దొరికాయి. అయితే నల్లధనాన్ని వైట్ మనీగా చూపేందుకు వీటిని చూపినట్టుగా గుర్తించారు. ఒక రోజులో సోదాలు ముగుస్తాయని అనుకున్నా… తవ్వేకొద్ది బయటపడుతున్న ఆస్తుల చిట్టా కారణంగా మరో రెండు రోజుల పాటు సోదాలు కొనసాగితేనే పూర్తి స్థాయిలో ఆస్తులను గుర్తించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News