ఇష్టం లేకుంటే చెప్పండి తప్పుకుంటా..

సౌమ్యంగా, శాంతంగా ఉండే తెలంగాణ సీఎల్సీ నేత జానారెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ గురించి జరిగిన సీఎల్పీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానని, తొందరలోనే టీఆర్‌ఎస్‌లో చేరతానని వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు. తాను సీఎల్పీ నేతగా వుండటం ఇష్టంలేనివాళ్లే ఇలా ప్రచారం చేయిస్తున్నారని, తాను సీఎల్పీ నేతగా వుండటం ఇష్టంలేకపోతే చెప్పండి వెంటనే తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. తనపై కావాలనే బురదజల్లుతున్నారని, ఇలాంటి వార్తలను పీసీసీ ఆఫీస్‌ బేరర్లే […]

Advertisement
Update: 2016-04-28 11:38 GMT

సౌమ్యంగా, శాంతంగా ఉండే తెలంగాణ సీఎల్సీ నేత జానారెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ గురించి జరిగిన సీఎల్పీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానని, తొందరలోనే టీఆర్‌ఎస్‌లో చేరతానని వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు. తాను సీఎల్పీ నేతగా వుండటం ఇష్టంలేనివాళ్లే ఇలా ప్రచారం చేయిస్తున్నారని, తాను సీఎల్పీ నేతగా వుండటం ఇష్టంలేకపోతే చెప్పండి వెంటనే తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. తనపై కావాలనే బురదజల్లుతున్నారని, ఇలాంటి వార్తలను పీసీసీ ఆఫీస్‌ బేరర్లే రాయించి ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై ఎవరైనా ఆరోపణలు చేస్తే తాను వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి ఖండిస్తానని, కానీ తనపై చాలా రోజులనుంచి వస్తున్న వార్తలను పార్టీ ముఖ్యనాయకులు ఎవరు ఖండించకపోవడం తనకు బాధించిందని అన్నారు. పీసీసీ నాయకత్వంపై కూడా మండిపడ్డారు జానారెడ్డి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే తాను వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి ఖండిస్తానని, కానీ తనపై వస్తున్న రూమర్స్‌ను ఆయన ఖండించకపోవడంపై బాధాకరమని అన్నారు. ఎప్పుడూ శాంతంగా ఉండే తమ జానారెడ్డి ఇలా మాట్లాడడంతో అక్కడ వున్న ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో వెంటనే తెరుకున్న నాయకులు మూకుమ్మడిగా “మీరే మా నాయకుడిగా ఉండాలి” చెప్పారు. త్వరలోనే సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌కు ఏర్పాట్లు పూర్తిచేస్తామని సమావేశాన్ని ముగించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News