హతవిధి పార్టీ మారినా కలిసిరాలేదు..

తెలుగుదేశం నుంచి   అధికార గులాబీపార్టీలోకి మారినా.. కొంత‌కాలంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్‌కు ఏమీ క‌లిసిరాలేదు. తాజాగా చింతల్‌లో ఆయ‌న నిర్మించిన భ‌వ‌నం అక్ర‌మ‌మంటూ దాన్ని కూల్చివేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నిక‌ల్లో కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ త‌ర‌ఫున కూన వివేకానంద్ విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నిర్మించిన భ‌వ‌నాలు అక్ర‌మ‌మైన‌వని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కేఎం ప్ర‌తాప్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఇప్ప‌టికే అధికారుల‌కు కోర్టు […]

Advertisement
Update: 2016-04-27 00:58 GMT
తెలుగుదేశం నుంచి అధికార గులాబీపార్టీలోకి మారినా.. కొంత‌కాలంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్‌కు ఏమీ క‌లిసిరాలేదు. తాజాగా చింతల్‌లో ఆయ‌న నిర్మించిన భ‌వ‌నం అక్ర‌మ‌మంటూ దాన్ని కూల్చివేయాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నిక‌ల్లో కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ త‌ర‌ఫున కూన వివేకానంద్ విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నిర్మించిన భ‌వ‌నాలు అక్ర‌మ‌మైన‌వని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కేఎం ప్ర‌తాప్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో ఇప్ప‌టికే అధికారుల‌కు కోర్టు చీవాట్లు పెట్టింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అధికార‌పార్టీలోకి మారారు. ఆయ‌న త‌న ఆస్తుల‌ను కాపాడుకునేందుకు పార్టీలో చేరార‌ని అప‌ట్లో విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. తాజాగా భ‌వ‌నాల‌ను కూల్చేయాలంటూ.. హైకోర్టు తీర్పునిచ్చింది. భ‌వ‌న నిర్మాణ స‌మ‌యంలో ఎలాంటి నిబంధ‌న‌లుపాటించ‌క‌పోగా.. నిర్మాణ‌ప‌రంగా అన్ని ర‌కాల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డ్డార‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. అందులో న‌డుస్తోన్న నారాయ‌ణ విద్యా సంస్థ‌ను వెంట‌నే ఖాళీ చేయాల‌ని ఆదేశించింది. ఈ భ‌వ‌నాల‌నిర్మాణాల‌కు స‌హ‌క‌రించిన అధికారుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకోమ‌ని ఆదేశించింది. దీంతో పార్టీ మారినా.. వివేకానంద్‌కు కాలం క‌లిసిరావ‌డం లేద‌ని నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ భ‌వ‌నాన్ని కూల్చితే వివేకానంద్‌కు కోట్ల రూపాయ‌ల న‌ష్టం, నారాయ‌ణ విద్యాసంస్త‌తో చేసుకున్న ఒప్పందం రెండింటినీ న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News