తండ్రి పొలిటికల్ ఎంట్రీపై విష్ణు సంచలన వ్యాఖ్యలు

హీరో విష్ణు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. సినీ పరిశ్రమలోని పోకడలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  చిన్నచిన్న సినిమాల డిస్ట్రిబ్యూటర్లను ఆ గ్రూప్‌ చాలా ఇబ్బందులు పెడుతోందన్నారు. సినిమా థియేటర్లన్నీ కొందరి చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. చిన్న సినిమా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని,  అన్ని సినిమాలను సమానంగా చూసే తత్వం పరిశ్రమలో లేదని కుండబద్ధలు కొట్టారు. చిన్న సినిమాలు నిర్మాతలు బయటకు చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్నారని విష్ణు అన్నారు.  ఏడాదికి 200 […]

Advertisement
Update: 2016-04-26 08:06 GMT

హీరో విష్ణు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. సినీ పరిశ్రమలోని పోకడలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నచిన్న సినిమాల డిస్ట్రిబ్యూటర్లను ఆ గ్రూప్‌ చాలా ఇబ్బందులు పెడుతోందన్నారు. సినిమా థియేటర్లన్నీ కొందరి చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు. చిన్న సినిమా వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని, అన్ని సినిమాలను సమానంగా చూసే తత్వం పరిశ్రమలో లేదని కుండబద్ధలు కొట్టారు. చిన్న సినిమాలు నిర్మాతలు బయటకు చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్నారని విష్ణు అన్నారు. ఏడాదికి 200 సినిమాలు విడుదలవుతుంటే అందులో 150 నుంచి 170 సినిమాల చిన్న నిర్మాతలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. థియేటర్లు అన్నీ ఒకరిద్దరి చేతిలో ఉండడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.

తన సినిమాలకు సంబంధించిన కథ తొలుత తాను వింటానని అయితే తన తండ్రి ఓకే చేసిన తర్వాతే సినిమా తీస్తామన్నారు. సినిమా పరాజయానికి దర్శకుడితే బాధ్యతని, తాము దర్శకుడి చేతిలో కీలుబొమ్మలం మాత్రమేనని అన్నాడు. తన తండ్రి రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని విష్ణు చెప్పారు. బహుశా తన తండ్రి వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు కాబట్టి రాజకీయాలకు సరిపోరని విష్ణు భావించి ఉండవచ్చు. రామాయణం తన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పాడు. ఇండస్ట్రీలో ధియేటర్లపై కొందరు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కూతుళ్లు పుట్టిన తర్వాత మహిళలపై గౌరవం మరింత పెరిగిందని విష్ణు అన్నాడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News