కూతురికి ఆస్తి హక్కుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

పెళ్లయిన మహిళలకు ఆస్తి హక్కులు సంక్రమించే విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.  ఒక వ్యక్తి తన భార్య, కొడుకుకు కాకుండా మొత్తం ఆస్తిని కూమార్తెకైనా ఇవ్వొచ్చని సుప్రీం తేల్చిచెప్పింది. పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ తీర్పు చెప్పింది. బెంగాల్ సహకార సంఘం నిబంధనల ప్రకారం ఒక ప్లాట్ ఓనర్ తన తర్వాత తన ఇంటిని  కుటుంబసభ్యులకు మాత్రమే ఇవ్కొచ్చని ఉంది. అయితే విశ్వరంజన్ సేన్ గుప్తా అనే వ్యక్తి […]

Advertisement
Update: 2016-04-21 04:17 GMT

పెళ్లయిన మహిళలకు ఆస్తి హక్కులు సంక్రమించే విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక వ్యక్తి తన భార్య, కొడుకుకు కాకుండా మొత్తం ఆస్తిని కూమార్తెకైనా ఇవ్వొచ్చని సుప్రీం తేల్చిచెప్పింది. పశ్చిమబెంగాల్‌కు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ తీర్పు చెప్పింది. బెంగాల్ సహకార సంఘం నిబంధనల ప్రకారం ఒక ప్లాట్ ఓనర్ తన తర్వాత తన ఇంటిని కుటుంబసభ్యులకు మాత్రమే ఇవ్కొచ్చని ఉంది. అయితే విశ్వరంజన్ సేన్ గుప్తా అనే వ్యక్తి తన తర్వాత ప్లాట్ తన కూతురికి ఇచ్చేశారు.

చివరి రోజుల్లో తనను భార్య, కొడుకు నిర్లక్ష్యం చేయడంతో కుమార్తె దగ్గరే ఉన్న విశ్వరంజన్ తన ప్లాట్‌ను ఆమె పేరునే రాసేశారు. అయితే కుమార్తెకు ప్లాట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ భార్య, కొడుకు హైకోర్టుకు వెళ్లారు. అక్కడ వారికే అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కుమార్తె ఇంద్రాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన జస్టిస్ జేఎస్ ఖేకర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. సహకార సంఘంలో సభ్యుడు తనకు కావల్సినవాళ్లను నామినేట్ చేసుకోవచ్చని, ఆ సభ్యుడు మరణించిన తర్వాత సొసైటీ తప్పనిసరిగా సదరు నామినీ ప్రయోజనాలను కాపాడాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.. కొడుకు, భార్యకు ఇవ్వకుండా పూర్తిగా కూతురికే ఆస్తి ఇచ్చే హక్కు ఆస్తిదారుడికి ఉంటుందని స్పష్టం చేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News