లోకేష్ మజ్జిగ స్రవంతి వెనుక కుట్ర... జలీల్‌ఖాన్‌ సవాల్‌కు బాబు సైయ్యా?

జనం వడదెబ్బ బారిన పడకుండా కాపాడేందుకు జిల్లాకు మూడు కోట్లు కేటాయించి మజ్జిగ సరఫరా చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయని వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు విమర్శించారు. హెరిటేజ్‌లోని పాలు, పెరుగు, మజ్జిగను అమ్ముకునేందుకు చంద్రబాబు… లోకేష్ మజ్జిగ స్రవంతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. గ్రామాల్లో   ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం లోకేష్ […]

Advertisement
Update: 2016-04-19 03:08 GMT

జనం వడదెబ్బ బారిన పడకుండా కాపాడేందుకు జిల్లాకు మూడు కోట్లు కేటాయించి మజ్జిగ సరఫరా చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయని వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు విమర్శించారు. హెరిటేజ్‌లోని పాలు, పెరుగు, మజ్జిగను అమ్ముకునేందుకు చంద్రబాబు… లోకేష్ మజ్జిగ స్రవంతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. గ్రామాల్లో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం లోకేష్ మజ్జిగ స్రవంతికి శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు.

మంచినీరు ఇవ్వడం మానేసి మీసాలకు సంపంగే నూనె చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హెరిటేజ్‌లో పెరుగును మజ్జిగగా మార్చి 39 కోట్ల రూపాయలను లోకేష్‌కు దోచిపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గతేడాది వర్షాలు సరిగా పడలేదు కాబ్టటి ఈసారి కరువు భయంకరంగా ఉంటుందని తెలిసినా ఇప్పటి వరకు నివారణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని… తిరిగి గెలిస్తే వైసీపీని మూసేస్తారా అని జలీల్‌ఖాన్ విసిరిన సవాల్‌కు అంబటి స్పందించారు. జలీల్‌ ఖాన్‌ సవాల్‌కు తాము సిద్ధమని ఒక వేళ ఎన్నికల్లో జలీల్‌ఖాన్ ఓడిపోతే చంద్రబాబు టీడీపీని మూసేస్తారేమో చెప్పాలని ప్రతిసవాల్ విసిరారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ధిక్కరించినా ఏమీ కాదంటూ ఒక పత్రిక కథనం రాయడం బట్టి… పత్రికలు చంద్రబాబు కోసం ఏ స్థాయికి దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.

నీతీ, నిజాయితీ, సిగ్గు, లజ్జ లేని సీఎం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమేనని అంబటి విమర్శించారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలను ఎంతకు కొనాలి, రాజ్యసభకు ఎవరిని పంపాలి అంటూ లెక్కలేసుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News