"గొర్రెలం... కసాయి చేసిన మోసం ఇది"

లోఫర్ మూవీ విషయంలో డిస్టిబ్యూటర్లు, డైరెక్టర్ మధ్య వివాదం ముదురుతోంది. డిస్టిబ్యూటర్లు తన ఇల్లు, ఆఫీసుపై దాడి చేశారని పూరి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై నిందితులుగా ఉన్న డిస్టిబ్యూటర్లు తీవ్రంగా స్పందించారు. తాము పూరి ఇంటిపై గానీ, ఆఫీసుపైగానీ ఎలాంటి దాడి చేయలేదన్నారు. అసలు తాము పూరి ఇల్లు, ఆఫీసుల వైపు కూడా వెళ్లలేదన్నారు. నిజంగా దాడి చేసి ఉంటే సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉంటుంది కదా అనిప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం […]

Advertisement
Update: 2016-04-18 01:17 GMT

లోఫర్ మూవీ విషయంలో డిస్టిబ్యూటర్లు, డైరెక్టర్ మధ్య వివాదం ముదురుతోంది. డిస్టిబ్యూటర్లు తన ఇల్లు, ఆఫీసుపై దాడి చేశారని పూరి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై నిందితులుగా ఉన్న డిస్టిబ్యూటర్లు తీవ్రంగా స్పందించారు. తాము పూరి ఇంటిపై గానీ, ఆఫీసుపైగానీ ఎలాంటి దాడి చేయలేదన్నారు. అసలు తాము పూరి ఇల్లు, ఆఫీసుల వైపు కూడా వెళ్లలేదన్నారు. నిజంగా దాడి చేసి ఉంటే సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉంటుంది కదా అనిప్రశ్నించారు.

పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. తెలిసిన పోలీస్ అధికారి ద్వారా తమపై కేసులు పెట్టించారని ఆరోపించారు. తమపై తప్పుడు కేసు పెట్టిన పూరిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. లోఫర్ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. మునుముందు తమ నుంచి ఇబ్బందులు వస్తాయన్న భావనతోనే పూరి ఇలా తప్పుడు కేసులు పెట్టి ఉండవచ్చాన్నారు. గతంలో సినిమాలు ఫ్లాఫ్ అయితే రజనీకాంత్, మహేష్‌ బాబు, పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో పాటు వివి వినాయక్, లింగుస్వామి, శ్రీనువైట్ల లాంటి దర్శకులు కొద్ది మేర రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేశారని గుర్తు చేశారు. వ్యవస్థలో డిస్టిబ్యూటర్లు గొర్రెల్లా మారిపోయారని డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు.

కసాయిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. మీడియా సమావేశంలో లోఫర్ డిస్టిబ్యూటర్లతో పాటు డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయంపై పూరితో మాట్లాడానని అయితే ఎలాంటి గ్యారెంటీ ఆయన వైపు నుంచి రాలేదని నిర్మాత సీ. కల్యాణ్ చెప్పారు. డిస్టిబ్యూటర్లపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని నిర్మాత సీ. కల్యాణ్ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News