రాజ్యసభ కావాలట... ముసుగు తీస్తున్న మీడియా వీరులు

ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. రాజకీయనాయకులే కాదు మీడియా అధినేతలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీకి ఇప్పటి వరకు తెర వెనుక నుంచి విపరీతమైన సేవలందించిన కొందరు మీడియా అధినేతలు రాజ్యసభ కోసం చంద్రబాబును తెగ మొహమాట పెట్టేస్తున్నారని సమాచారం. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ మీడియా ద్వారా చేసిన ప్రయత్నాలను, సేవలను వివరిస్తూ ఒక్క చాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారట. పత్రికతో పాటు టీవీ ఛానల్‌ […]

Advertisement
Update: 2016-04-17 00:28 GMT

ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. రాజకీయనాయకులే కాదు మీడియా అధినేతలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీకి ఇప్పటి వరకు తెర వెనుక నుంచి విపరీతమైన సేవలందించిన కొందరు మీడియా అధినేతలు రాజ్యసభ కోసం చంద్రబాబును తెగ మొహమాట పెట్టేస్తున్నారని సమాచారం. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ మీడియా ద్వారా చేసిన ప్రయత్నాలను, సేవలను వివరిస్తూ ఒక్క చాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారట. పత్రికతో పాటు టీవీ ఛానల్‌ కూడా ఉన్న మీడియా అధినేత ఒకరు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

ఎన్నికల సమయంలో ఎంతో తెగింపుతో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని దానితో పోలిస్తే రాజ్యసభ ఇవ్వడం చాలా చిన్న ఉపకారమేనని టీడీపీ నేతల ద్వారా కూడా చెప్పిస్తున్నారట. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడాన్ని ఒక ఘన కార్యంగా ప్రచారం చేయడంలోనూ సదరు పత్రిక, టీవీ ఛానల్‌ ముందుండడం వెనుక కూడా రాజ్యసభ సీటుపై గురి కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ రేసులో సుజనా చౌదరికూడా ఉన్నారు. అతడిని రేసు నుంచి తప్పిస్తే ఆ స్థానం తనకు ఈజీగా దక్కుతుందని సదరు మీడియా అధినేత భావిస్తున్నారని చెబుతున్నారు.

అందుకే సుజనాకు వ్యతిరేకంగా ఏ అంశం తెరపైకి వచ్చినా తన పత్రిక, ఛానల్ ద్వారా బాగా నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. మెరిసే సంఘం కోసం పనిచేస్తున్నట్టు చెప్పుకునే ఒక ఛానల్‌లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి కూడా రాజ్యసభ కోసం చంద్రబాబును కోరుతున్నారు. ఈయన కూడా సుజనా స్థానంపైనే కన్నేశారట. అందుకే సుజనా చౌదరికి చెందిన కంపెనీల ఆర్ధిక అవకతవకలపై సదరు ఛానల్ ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం చేసిందని గుర్తు చేస్తున్నారు. బాబు సొంత జిల్లాకే చెందిన మరో మీడియా అధినేత కూడా తన మంచితనం చూసి సీటు ఇవ్వాలని కోరుతున్నారు.

రామోజీరావు సమీప బంధువు ఒకరు కూడా టీడీపీ కోటాలో రాజ్యసభ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పైగా రామోజీ బంధువుకు చంద్రబాబుతో చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇంతకాలం మీడియా ముసుగేసుకుని టీడీపీ కోసం పనిచేసిన సదరు మీడియా అధినేతలు… రాజ్యసభ దక్కితే బహిరంగంగానే టీడీపీకి ప్రచారం చేసేందుకు సిద్ధపడ్డారట. అయితే అందరికీ రాజ్యసభ సీటు దక్కే అవకాశం లేకపోవడంతో అందరూ కాకపోయినా ఎవరో ఒక మీడియా అధినేత ముసుగు రాజ్యసభ ఎన్నికల ద్వారా తొలగిపోతుందని చెబుతున్నారు. రాజ్యసభ దక్కని మీడియా అధినేతలు మాత్రం ఎప్పటి లాగే ముసుగేసుకుని పనిచేస్తారని చెబుతున్నారు. అయితే మీడియా అధినేతల్లో ఒకరికి అవకాశం ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకపోతే మునుముందు తేడాలొస్తాయేమోనని కొందరు పార్టీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News