కౌన్సెలింగ్‌కు సుజ‌నా వ‌స్తారా?

హైద‌రాబాద్ పోలీసులు నిత్యం రాత్రిపూట స్పెష‌ల్ డ్రైవ్‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ప‌లు మార్లు వీఐపీలు, సినిమాస్టార్లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి కుమారుడు పోలీసుల‌కు కార్‌రేసింగ్‌లో పాల్గొంటూ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. వీరిని అరెస్టు చేయ‌కున్నా.. అదుపులోకి తీసుకున్నారు. వారి వాహ‌నాల‌ను సీజ్ చేశారు. అయితే, మంత్రి కుమారుడు సాయికార్తీక్ తోపాటు మ‌రికొంద‌రు యువ‌కులు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీరంద‌రినీ విడుద‌ల చేసే ముందు వారితోపాటు త‌ల్లిదండ్రుల‌కు కౌన్సెలింగ్ […]

Advertisement
Update: 2016-04-15 23:14 GMT

హైద‌రాబాద్ పోలీసులు నిత్యం రాత్రిపూట స్పెష‌ల్ డ్రైవ్‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో ప‌లు మార్లు వీఐపీలు, సినిమాస్టార్లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి కుమారుడు పోలీసుల‌కు కార్‌రేసింగ్‌లో పాల్గొంటూ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. వీరిని అరెస్టు చేయ‌కున్నా.. అదుపులోకి తీసుకున్నారు. వారి వాహ‌నాల‌ను సీజ్ చేశారు. అయితే, మంత్రి కుమారుడు సాయికార్తీక్ తోపాటు మ‌రికొంద‌రు యువ‌కులు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీరంద‌రినీ విడుద‌ల చేసే ముందు వారితోపాటు త‌ల్లిదండ్రుల‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాతే ఇంటికి పంపుతారు. మ‌రి, ఇప్పుడు పోలీసుల కౌన్సెలింగ్‌కు సుజ‌నా వ‌స్తారా? లేదా ? అన్న‌ది ఆస‌క్తికరంగా మారింది.

అస‌లే కేంద్రమంత్రిగా ఉన్న సుజ‌నా చౌద‌రికి క్ష‌ణం తీరిక ఉండ‌దు. మారిష‌స్ బ్యాంకుల నుండి పొందిన రుణం వ్య‌వ‌హారంలో ఆయ‌న కోర్టుల‌కు వెళ్ల‌లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల అరెస్ట్ వారెంట్ జారీ కూడా అయిన సంగ‌తి తెలిసిందే! అయితే, అంత పెద్ద కేసుల‌కే హాజ‌ర‌య్యేందుకు ఆయ‌న‌కు స‌మ‌యం చిక్క‌లేదంటే.. ఇంత చిన్న కేసు విష‌యంలో అదీ కొడుకుకు సంబంధించిన ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు తల్లితండ్రులకు ఇచ్చే కౌన్సెలింగ్‌కు హాజ‌ర‌వుతారా అన్న‌ది ఆస‌క్తికరంగా మారింది. లేకపోతే ప్రభుత్వ చట్టాలు అందరికి సమానమే అని ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తూ కౌన్సెలింగ్ కి హాజరు అవుతారా అన్నది వేచి చూడాలి. అయితే సుజ‌నా స్వ‌యంగా రావొచ్చు.. లేకుంటే వారి కుటుంబ‌స‌భ్యుల‌ను ఎవ‌రినైనా పంపించవ‌చ్చు.. మీడియా వారిని ఎదుర్కోవ‌డం ఇబ్బందిగా అనుకుంటే.. మాత్రం ఆయ‌న వ‌చ్చే అవ‌కాశాలు అంతంత‌మాత్ర‌మే!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News