నరసరావుపేట మండల టీడీపీ నేత ఇంట్లో పేలిన బాంబులు

గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఫ్యాక్షన్ కల్చర్ పోయినట్టు కనిపించడం లేదు.  ఇప్పటికీ ఇళ్లలో బాంబులు ఉంచే సంస్కృతి కొనసాగుతోంది. తాజాగా నరసరావుపేట మండలం పమిడిపాడులో కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడీపీ  చోటా నేత ఎద్దు వెంకటేశ్వర్లు ఇంటిలో ఉదయం బాంబులు పేలాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. ఇల్లు మాత్రం ధ్వంసమైంది. ఈ ఘటనలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ బాంబులు ఎందుకు నిల్వ చేసుకున్నారు?. మరెవరిపైనైనా దాడులు చేసేందుకు వీటిని ఉంచుకున్నారా లేక […]

Advertisement
Update: 2016-04-14 23:20 GMT

గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఫ్యాక్షన్ కల్చర్ పోయినట్టు కనిపించడం లేదు. ఇప్పటికీ ఇళ్లలో బాంబులు ఉంచే సంస్కృతి కొనసాగుతోంది. తాజాగా నరసరావుపేట మండలం పమిడిపాడులో కలకలం రేగింది. గ్రామానికి చెందిన టీడీపీ చోటా నేత ఎద్దు వెంకటేశ్వర్లు ఇంటిలో ఉదయం బాంబులు పేలాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. ఇల్లు మాత్రం ధ్వంసమైంది. ఈ ఘటనలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ బాంబులు ఎందుకు నిల్వ చేసుకున్నారు?. మరెవరిపైనైనా దాడులు చేసేందుకు వీటిని ఉంచుకున్నారా లేక ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఎలాంటి అవాంచనీయసంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరిపేందుకే కొంతమంది నాటు బాంబులను దిబ్బల్లో, పొదల్లో దాచిపెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News