చంద్రబాబుకు దౌర్భాగ్యం అనే రోగం ఉంది

వైసీపీ కేంద్రకార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్ వెనుకబడిన వర్గాల కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ స్పూర్తితో పనిచేయాలన్నారు. అయితే చంద్రబాబు లాంటి నాయకులు అంబేద్కర్ స్పూర్తిని విస్మరించడం బాధాకరమన్నారు. వెనుకబడిన వారి విషయంలో చంద్రబాబు తన మైండ్ సెట్ మార్చుకోవాలని కోరారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీఎస్టీలకు దక్కాల్సిన నిధులను చంద్రబాబు దారి మళ్లించారని ఈ విషయాన్ని […]

Advertisement
Update: 2016-04-14 01:39 GMT

వైసీపీ కేంద్రకార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన జగన్ వెనుకబడిన వర్గాల కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ స్పూర్తితో పనిచేయాలన్నారు. అయితే చంద్రబాబు లాంటి నాయకులు అంబేద్కర్ స్పూర్తిని విస్మరించడం బాధాకరమన్నారు. వెనుకబడిన వారి విషయంలో చంద్రబాబు తన మైండ్ సెట్ మార్చుకోవాలని కోరారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఎస్సీఎస్టీలకు దక్కాల్సిన నిధులను చంద్రబాబు దారి మళ్లించారని ఈ విషయాన్ని కాగ్‌ కూడా తప్పుపట్టిందన్నారు. ఫిరాయింపులు ఉండకూడదని రాజ్యాంగం చెబుతుంటే … చంద్రబాబు మాత్రం పక్కపార్టీ ఎమ్మెల్యేలకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు. ఇదేనా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై చంద్రబాబుకు ఉన్న గౌరవం అని ప్రశ్నించారు. పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా చంద్రబాబు లేదన్నారు జగన్. అవసరమైనప్పుడు ఫొటోలకు దండలేడయం… అవసరం తీరగానే వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. చంద్రబాబు దౌర్బాగ్యమనే రోగం ఉందని అందుకే ఇలా చేస్తుంటారని జగన్ విమర్శించారు.

Click on Image to Read:


Tags:    
Advertisement

Similar News