కిష‌న్ రెడ్డి కి ఏం ప‌ద‌వి ఇస్తారు?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షునిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే.. డాక్ట‌ర్‌. ల‌క్ష్మ‌ణ్ ఎన్నిక‌య్యారు. దీంతో రెండు ప‌ర్యాయాలు రాష్ట్రంలో బీజేపీ అధ్య‌క్షుడినిగా ఉన్న కిష‌న్‌రెడ్డికి పార్టీలో ఏం ప‌ద‌వి ఇస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో కిష‌న్ రెడ్డి త‌న వంతుగా కృషి చేశారు. కానీ, పార్టీలో మిగిలిన ఎవ‌రినీ ఎద‌గ‌నీయ‌డ‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. కిష‌న్‌రెడ్డి తీరు వ‌ల్లే.. నాగం జ‌నార్ద‌న్ రెడ్డి, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ ఇప్ప‌టికే పార్టీకి దాదాపుగా […]

Advertisement
Update: 2016-04-09 00:44 GMT
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షునిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే.. డాక్ట‌ర్‌. ల‌క్ష్మ‌ణ్ ఎన్నిక‌య్యారు. దీంతో రెండు ప‌ర్యాయాలు రాష్ట్రంలో బీజేపీ అధ్య‌క్షుడినిగా ఉన్న కిష‌న్‌రెడ్డికి పార్టీలో ఏం ప‌ద‌వి ఇస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో కిష‌న్ రెడ్డి త‌న వంతుగా కృషి చేశారు. కానీ, పార్టీలో మిగిలిన ఎవ‌రినీ ఎద‌గ‌నీయ‌డ‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. కిష‌న్‌రెడ్డి తీరు వ‌ల్లే.. నాగం జ‌నార్ద‌న్ రెడ్డి, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ ఇప్ప‌టికే పార్టీకి దాదాపుగా దూర‌మ‌య్యారన్న‌ది పార్టీలో బ‌హిరంగ విష‌య‌మే. అయితే, మిగిలిన రాష్ట్ర అధ్య‌క్షుల కంటే కిష‌న్ రెడ‌డి పార్టీని హైద‌రాబాద్ న‌గంలో విస్త‌రించ‌డంలో త‌న‌దైన ముద్ర వేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న 2014 ఎన్నిక‌ల్లో ఏకంగా 5 బీజేపీ అసెంబ్లీ స్థానాల‌ను గెలుచుకోవ‌డంలో త‌న వంతు పాత్ర పోషించారు. అందుకే, ఆయ‌న‌కు మ‌రిన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించేలా.. జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు క‌ల్పిస్తార‌ని ఆయ‌న వ‌ర్గీయులు ధీమాతో ఉన్నారు. పైగా గ‌తంలో న‌రేంద్ర మోదీతో క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌టంతో ఆయ‌న‌కు ప్రాధాన్యం ఉన్న ప‌ద‌వే ఇస్తార‌ని అనుకుంటున్నారు. బీజేపీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. పార్టీకి సంబంధించిన ఏ ప‌ద‌వినైనా రెండుసార్ల కంటే ఎక్కువ సార్లు చేప‌ట్టేందుకు వీలు లేదు. కానీ, తెలంగాణ‌లో ఉన్న ప‌రిస్థితుల ప్ర‌కారం.. త‌న‌కు మూడోసారి కూడా అవ‌కావం వ‌స్తుంద‌ని కిష‌న్‌రెడ్డి భావించార‌ని స‌మాచారం. ఈ విష‌యంలో పార్టీ అధిష్టానం కూడా నిర్ణ‌యాన్ని వెలువ‌రించ‌డంలో జాప్యం చేయ‌డంతో ఈసారి కూడా కిష‌న్‌రెడ్డికే పార్టీ ప‌గ్గాలు ద‌క్కుతాయ‌ని భావించారంతా. ఎప్ప‌టిలాగే న‌గ‌రానికి చెందిన ఎమ్మెల్యేకే ఈసారీ.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డంతో ఆ విష‌యంలో నెల‌కొన్న సందిగ్ధ‌త వీడిపోయింది.
Tags:    
Advertisement

Similar News