సీఎం, కేంద్ర మాజీ మంత్రి కూడా లైంగికంగా వేధించారు

కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాంకు సంబంధించి కొత్తకొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.  సోలార్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న సరితా నాయర్‌ … ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ లేఖ కేరళ రాజకీయాల్లో కలకలం రేపింది.  తనను ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తూ రాసిన ఈ లేఖను ఆసియన్ నెట్ న్యూస్ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి […]

Advertisement
Update: 2016-04-03 20:35 GMT

కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాంకు సంబంధించి కొత్తకొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సోలార్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న సరితా నాయర్‌ … ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ లేఖ కేరళ రాజకీయాల్లో కలకలం రేపింది. తనను ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆరోపణలు చేస్తూ రాసిన ఈ లేఖను ఆసియన్ నెట్ న్యూస్ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది.

చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని సదరు లేఖలో సరిత వాపోయారు. సీఎంకు లంచం కూడా ఇచ్చానని అయినా లైంగికంగానూ వాడుకోవాలని చూశారని ఆరోపించారు. ఈ లేఖను సరిత మేజిస్ట్రేట్‌కు సమర్పించనున్నారు. ఇది వరకే ఆమె ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ కుమారుడిపై లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రిపైనా ఆరోపణలు చేశారు. అయితే కేంద్ర మాజీ మంత్రి ఎవరన్నది వెల్లడి కావాల్సి ఉంది.

చానల్‌లో ప్రసారమైన లేఖపై సరిత కూడా స్పందించారు. సదరు లేఖ తాను రాసిందేనని అంగీకరించారు. పోలీస్ కస్టడీలో ఉండగా లేఖను రాసినట్టు వెల్లడించారు. లేఖలో రాసినవన్నీ వాస్తవాలేనని చెప్పారు. అయితే ఈ లేఖలో ఆరోపణలను సీఎం ఉమెన్ చాందీ ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తనను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News