రోజా తీరును తీవ్రంగా తప్పుపడుతున్న వైసీపీ అభిమానులు

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెరుగైన సమాజం కోసం అని ట్యాగ్‌లైన్ పెట్టుకున్న టీవీ9 ప్రతినిధి బరితెగించి అడిన ప్రశ్నను చూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. యాక్షన్ సినిమాల తరహాలో ఓవర్‌ యాక్షన్ చేస్తూ ఇంటర్వ్యూ చేసే సదరు టీవీ9 ప్రతినిధి తాజాగా రోజాను ఇంటర్వ్యూ చేశారు. ఒక మహిళను ఈ ప్రశ్న అడగవచ్చా అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఎమ్మెల్యే అయిన రోజాను ఒక […]

Advertisement
Update: 2016-04-01 13:52 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెరుగైన సమాజం కోసం అని ట్యాగ్‌లైన్ పెట్టుకున్న టీవీ9 ప్రతినిధి బరితెగించి అడిన ప్రశ్నను చూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. యాక్షన్ సినిమాల తరహాలో ఓవర్‌ యాక్షన్ చేస్తూ ఇంటర్వ్యూ చేసే సదరు టీవీ9 ప్రతినిధి తాజాగా రోజాను ఇంటర్వ్యూ చేశారు.

ఒక మహిళను ఈ ప్రశ్న అడగవచ్చా అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఎమ్మెల్యే అయిన రోజాను ఒక నీచమైన ప్రశ్న అడిగాడు. మీరు బ్లూఫిల్మ్‌లో నటించారా లేదా అంటూ సిగ్గులేకుండా అడిగారు. సిగ్గులేని ఈ ప్రశ్నను అడగడమే కాకుండా తిరిగి అదే ప్రశ్నను ప్రోమోలో వాడుకోవడం చూసి చానల్‌ సంగతి ఏమో గానీ జనమే సిగ్గుపడుతున్నారు. రోజాను ఇంటర్యూ చేసిన సదరు జర్నలిస్టు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇలా ఎక్స్‌ట్రాలు చేయడం సర్వసాధారణంగా మారిందన్న అభిప్రాయం ఉంది. అయితే వైసీపీ అభిమానులు కొందరు మరోలా స్పందిస్తున్నారు.

రోజా తీరునే తప్పుపడుతున్నారు. నేరుగా అంతనీచమైన ప్రశ్న అడిగిన వెంటనే చెప్పుతో కొట్టి వచ్చిఉంటే గర్వపడేవారిమంటున్నారు. లేదా మీ ఇంటిలోని మహిళలు కూడా ఇలాగే నీలిచిత్రాల్లో నటించారేమో వెళ్లి అడుగు అని ఎదురు ప్రశ్నించాల్సిందంటున్నారు. నిత్యం మెరుగైన సమాజం కోసం అంటూ వేదికలెక్కి నీతులు చెప్పే రవిప్రకాశ్… సొంత చానళ్లలోనే ఉన్న ఇలాంటి మురుగుపై ఎలా స్పందిస్తారో !. ఇలాంటి జర్నలిస్టులు ఉంటే జర్నలిజం పరువు మురుగు కాలువలో కాకుండా మెరుగైన సమాజంలో కలుస్తుందా ?. అయితే టీవీ9 ప్రతినిధి అడిగిన ప్రశ్నపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ప్రతికూల స్పందన రావడంతో చానల్ వారు సదరు ప్రోమోను ఇంటర్ నెట్ నుంచి తొలగించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News