బాబు సొంత సోకుకు రూ. కోటి 36 లక్షలు విడుదల

చంద్రబాబుకు ఎన్ని క్యాంపు కార్యాలయాలున్నాయి?. ఆయనకు ఎన్ని కాన్వాయ్‌లు ఉన్నాయి?. సీఎం ఇప్పటి వరకు ఎన్ని కార్యాలయాలకు మరమ్మతులు చేయించుకున్నారు?. వీటికి టక్కున‌ సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చంద్రబాబుకు విజయవాడలో ఒక కార్యాలయం, హైదరాబాద్‌లో ఒక కార్యాలయం. ఉండవల్లి కృష్ణానది కరకట్టపై మరోభారీ భవనం. హైదరాబాద్‌లో సొంత ఇల్లు. అదే కాకుండా ఫాంహౌజ్‌లో బాబు ఫ్యామిలీ కొత్త నివాసం. ఇలా బాబు ఏ కార్యాలయాన్ని వాడుతున్నారు… ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నారు అన్నది అంత ఈజీగా చెప్పడం […]

Advertisement
Update: 2016-04-01 22:55 GMT

చంద్రబాబుకు ఎన్ని క్యాంపు కార్యాలయాలున్నాయి?. ఆయనకు ఎన్ని కాన్వాయ్‌లు ఉన్నాయి?. సీఎం ఇప్పటి వరకు ఎన్ని కార్యాలయాలకు మరమ్మతులు చేయించుకున్నారు?. వీటికి టక్కున‌ సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే చంద్రబాబుకు విజయవాడలో ఒక కార్యాలయం, హైదరాబాద్‌లో ఒక కార్యాలయం. ఉండవల్లి కృష్ణానది కరకట్టపై మరోభారీ భవనం. హైదరాబాద్‌లో సొంత ఇల్లు. అదే కాకుండా ఫాంహౌజ్‌లో బాబు ఫ్యామిలీ కొత్త నివాసం. ఇలా బాబు ఏ కార్యాలయాన్ని వాడుతున్నారు… ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నారు అన్నది అంత ఈజీగా చెప్పడం కష్టమే.

అయితే వీటన్నింటికి ప్రజాధనాన్ని నీటిలాగా ఖర్చుపెట్టేస్తున్నాయి. అదే ఇప్పుడు అందరి అభ్యంతరం. ఇప్పటికే సొంత కార్యాయాల మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు. తాజాగా మదీనాగూడలోని ఫాంహౌస్‌ను క్యాంప్ రెసిడెన్స్‌గా చూపుతూ దాని మరమ్మతుల కోసం కోటి 36 లక్షలను మంజూరు చేసుకున్నారు. చంద్రబాబు ఆదేశంలో ఆర్థిక శాఖ వెంటనే నిధులు మంజూరు చేసింది.

చంద్రబాబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొంతకాలం నివాసం ఉన్నారు. దాంతో దాన్నే సీఎం అధికారిక నివాసంగా భావించి అదనపు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మదీనాగూడలోని ఫాంహౌస్‌ను క్యాంప్ రెసిడెన్స్‌గా పేర్కొంటూ ఇక్కడకూ నిధులు విడుదల చేశారు. జూన్ 15 నుంచి కొత్త రాజధాని వేదికగానే పాలన సాగిస్తామని చెబుతూనే ఇలా హైదరాబాద్‌ లోని కార్యాలయాలు, ఆఫీసులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News