వెంకయ్య కన్ను విశాఖపై పడింది

వెంకయ్యనాయుడు తన వారసులను రాజకీయాల్లో దింపేందుకు సిద్ధమవుతున్నారు. తన వారసురాలిగా కూతురు దీపను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు విశాఖను వేదిక చేసుకునే ఆలోచనలో వెంకయ్య ఉన్నట్టు చెబుతున్నారు. త్వరలో జరగనున్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో కూతురును నిలిపేందుకు వెంకయ్య ప్రయత్నిస్తున్నారు. ఏకంగా విశాఖ మేయర్ పీఠంపై కూతురిని కూర్చోబెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. వెంకయ్య ఇలాంటి ఆలోచన చేస్తున్నారని తెలుసుకుని లోకల్లో ఉండే టీడీపీ, బీజేపీ నేతలు కంగారు […]

Advertisement
Update: 2016-04-01 09:53 GMT

వెంకయ్యనాయుడు తన వారసులను రాజకీయాల్లో దింపేందుకు సిద్ధమవుతున్నారు. తన వారసురాలిగా కూతురు దీపను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు విశాఖను వేదిక చేసుకునే ఆలోచనలో వెంకయ్య ఉన్నట్టు చెబుతున్నారు. త్వరలో జరగనున్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో కూతురును నిలిపేందుకు వెంకయ్య ప్రయత్నిస్తున్నారు. ఏకంగా విశాఖ మేయర్ పీఠంపై కూతురిని కూర్చోబెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. వెంకయ్య ఇలాంటి ఆలోచన చేస్తున్నారని తెలుసుకుని లోకల్లో ఉండే టీడీపీ, బీజేపీ నేతలు కంగారు పడుతున్నారు.

చంద్రబాబుతో వెంకయ్యనాయుడు మాట్లాడుకుంటే తప్పుకుండా ఆయన కూతురే మేయర్ అభ్యర్థి అవుతారని బీజేపీ, టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు తెలివిగా ఈ విషయంలో ముందు నుంచే పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. విశాఖ మేయర్ పీఠంపై కన్నేయడం వల్లే విశాఖ పరిధిలోని రెండు గ్రామాలను కూతురు దత్తతు తీసుకునేలా చేశారంటున్నారు. వెంకయ్య తీరుపై విశాఖ వాసులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వారు కాకుండా స్థానికులకే మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలంటున్నారు.

వెంకయ్య కూతురుతో పాటు మంత్రి గంటా శ్రీనివాస్ కూమారుడు రవితేజ పేరు కూడా మేయర్ అభ్యర్థి రేసులో వినిపిస్తోంది. ఇటీవలే రవితేజ మంత్రి నారాయణ కూతురిని పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో హీరో అయ్యేందుకు శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమా ఆలోచనకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అటు తండ్రి, ఇటు మామ బలంతో విశాఖ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగాలనుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపిక కూడా రేసులో ఉన్నారు. ఇప్పటికే ఆమె రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అయితే వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఒకటైతే మాత్రం ఇతరులకు అవకాశం లేనట్టేనని చెబుతున్నారు. అయితే వెంకయ్యనాయుడు కూతురిని మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేస్తే స్థానికులతో పాటు స్థానిక నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News