రాజకీయాలను తాకిన సింగపూర్ డ్రీమ్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆత్మవిశ్వాసం మరీ అధికమైనట్టుగా ఉంది. ప్రతిదానికీ సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న సీఎం.. ఇప్పుడు రాజకీయాలకు సింగపూర్ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇతర పార్టీల వారు టీడీపీలో చేరేందుకు పూర్తిగా గేట్లు ఎత్తివేస్తానని నేతలకు చంద్రబాబు చెప్పారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. అయితే అదే సమయంలో చంద్రబాబు ఒక కొత్త ఉదాహరణ తెరపైకి తెచ్చారు. […]

Advertisement
Update: 2016-04-01 00:49 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆత్మవిశ్వాసం మరీ అధికమైనట్టుగా ఉంది. ప్రతిదానికీ సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న సీఎం.. ఇప్పుడు రాజకీయాలకు సింగపూర్ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇతర పార్టీల వారు టీడీపీలో చేరేందుకు పూర్తిగా గేట్లు ఎత్తివేస్తానని నేతలకు చంద్రబాబు చెప్పారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. అయితే అదే సమయంలో చంద్రబాబు ఒక కొత్త ఉదాహరణ తెరపైకి తెచ్చారు.

సింగపూర్‌లో రాజకీయాలు చూస్తే దశాబ్దాలుగా అక్కడ ప్రతిపక్షమే లేదని వివరించారు. అదే పరిస్థితి ఏపీలో కూడా ఉండాలని కొత్త ఆలోచనను ఆవిష్కరించారు. అలా చేసేందుకు వైసీపీతో పాటు ఏ పార్టీ నేతలు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని ప్రకటించారు.దీనిపై నేతలెవ్వరూ అభ్యంతరం చెప్పకూడదని హుకుం జారీ చేశారు. ఇతర పార్టీల నేతలందరినీ చేర్చుకోవడం ద్వారా సింగపూర్ తరహాలో ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని ఆదేశించారు. అయితే చంద్రబాబు ఆలోచనపై నేతలంతా మౌనంగా విన్నారని సమాచారం. కానీ చంద్రబాబు చెబుతున్న దారిలో వెళ్తే ప్రతిపక్షాలను లేకుండా చేయడం సాధ్యమా అని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే…

సింగపూర్‌కు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. సింగపూర్‌లో ప్రతిపక్షం లేకుండా పోయిందంటే అక్కడ పాలన తీరు అలా ఉంది. మరి ఏపీలోనూ పరిపాలన అంత నాణ్యతగా ఉందా?. ఒక ప్రజాప్రతినిధి అందరూ చూస్తుంటే మహిళ తహసీల్దార్‌ను ఈడ్చి కొట్టారు. కానీ సింగపూర్‌ నేతలు ఇలాంటి దురాగతాలు చేయరు కదా?. అధికార పార్టీ నేతలే కాల్‌మనీ పేరుతో వందలమంది మహిళల జీవితాలతో ఆడుకుంటే ప్రభుత్వం నుంచి చర్యలే లేవు. ఇదే ఘటన సింగపూర్‌లో జరిగి ఉంటే సంగతి మరోలా ఉండేది. అసలు ఒక పార్టీ తరపున గెలిచిన వారిని కోట్లు పెట్టి కొని మరోపార్టీలో చేర్చుకునే సంప్రాదాయం సింగపూర్‌లో ఉందా?.

చంద్రబాబు దృష్టిలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా, ప్రజానిధులుగా ఉన్నవారే లీడర్లా?. వారందరిని టీడీపీలో చేర్చుకుంటే ఇకపై కొత్తగా నాయకత్వం రాదు అన్న ఆలోచనలో ఉన్నారా?. ఒకవేళ వైసీపీలోని నేతలందరినీ కొనేసినా మరో కొత్త నాయకత్వం పుట్టుకొస్తుందన్న కనీసం విషయం చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా?. ఒకవేళ అసలు ప్రత్యర్థి పార్టీకి నేతలే లేకుండా చేయడంతో పాటు కొత్తగా నేతలు తయారుకాకుండా అడ్డుకోవాలంటే కనీసం ఒక రెండు కోట్ల మందిని చంద్రబాబు ముందే కొనేయాల్సి ఉంటుందేమో!. ఇప్పటికైనా సింగపూర్‌ను డ్రీమ్స్‌లో వదిలేసి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అనే దాని మీద ఫోకస్ పెడితే ఇలా నేతలను కొనాల్సిన పాట్లు తప్పుతాయి. మరోసారి అధికారంలోకి వచ్చేందుకూ అవకాశాలు ఉంటాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News