ప్రియాంక కమిటైంది మళ్లీ..!
ప్రస్తుతం ఇండియన్ హీరోయిన్ స్థాయి నుంచి యునివర్సల్ స్టార్ అనిపించుకోనే స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా… మరో కొత్త మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి సిద్దం అయ్యిందట. గతంలో మేరికోమ్ జీవితం ఆధారంగా చేసిన సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుని పరకాయ ప్రవేశం చేసి మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్టరెస్.. తాజాగా హాలీవుడ్ లో బేవాచ్ అనే ఒక సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి సిద్దం అయ్యిందట. కరాటే, బాక్సింగ్, జూడో లాంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ […]
ప్రస్తుతం ఇండియన్ హీరోయిన్ స్థాయి నుంచి యునివర్సల్ స్టార్ అనిపించుకోనే స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా… మరో కొత్త మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి సిద్దం అయ్యిందట. గతంలో మేరికోమ్ జీవితం ఆధారంగా చేసిన సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుని పరకాయ ప్రవేశం చేసి మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్టరెస్.. తాజాగా హాలీవుడ్ లో బేవాచ్ అనే ఒక సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడానికి సిద్దం అయ్యిందట.
కరాటే, బాక్సింగ్, జూడో లాంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ అనే విషయం తెలిసిందే. అయితే, ప్రియాంక ‘బేవాచ్’ కోసం ‘కెజుకెన్బో’ అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోనున్నారు. ఇది అమెరికాలో ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్. కరాటే, కొరియన్ కరాటే, జూడో, కెన్బో, వెస్ట్రన్, చైనీస్ బాక్సింగ్ లాంటి ఆరు మార్షల్ ఆర్ట్స్ కలిపిన విశేషమైన యుద్ధవిద్య ‘కెజుకెన్బో’. ఇది నేర్చుకోవాలంటే చిన్న విషయం మాత్రం కాదట. బేవాచ్ చిత్రంలో ప్రియాంక విలన్ రోల్ పోషించ బోతున్న విషయం తెలిసిందే. మరి హార్డ్ సినిమా సినిమాకు ఏదో ఒక ప్రత్యేకత చూపుతున్న ప్రియాంక చోప్రా బేవాచ్ కోసం పెద్ద రిస్కే చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది బద్దకస్తులైన హీరోలకు ఒక చురకలాంటిందే మరి.