స్పీకర్‌పై తీవ్ర విమర్శలు చేసిన జగన్

అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సిగ్గులేకుండా చట్టసభను వాడుకున్నారని మండిపడ్డారు . స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారని విమర్శించారు. ద్రవ్యవినిమయ బిల్లుపై మూజువాణి ఓటు నిర్వహించిన స్పీకర్‌ … వైసీపీ  వైపు 67 మంది ఉన్నారని చెప్పడం కన్నా దారుణమైన విషయం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసి ఆమె కూడా […]

Advertisement
Update: 2016-03-31 04:09 GMT

అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సిగ్గులేకుండా చట్టసభను వాడుకున్నారని మండిపడ్డారు . స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారని విమర్శించారు. ద్రవ్యవినిమయ బిల్లుపై మూజువాణి ఓటు నిర్వహించిన స్పీకర్‌ … వైసీపీ వైపు 67 మంది ఉన్నారని చెప్పడం కన్నా దారుణమైన విషయం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసి ఆమె కూడా సభకు హాజరైందని స్పీకర్‌ చెప్పడాన్ని ఏమనాలన్నారు.

స్పీకర్ కళ్ల ముందే వైసీపీ చెందిన పది ఎమ్మెల్యేలు టీడీపీ బెంచీల్లో కూర్చున్నా అది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఫిరాయించి టీడీపీ సీట్లలో కూర్చుకున్న వారిని కూడా వైసీపీ ఎమ్మెల్యేల జాబితాలో ఎలా చేరుస్తాని నిలదీశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు స్పీకరే నేరుగా రంగంలోకి దిగడం మించిన దారుణమైన సంఘటన ఎక్కడైనా ఉంటుందా అని విమర్శించారు. స్పీకర్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టిన సమయంలోనూ కోడెల శివప్రసాదరావు తానే గొప్ప అన్నట్టు రూల్స్ రద్దుచేసుకుని అప్పటికప్పుడు చర్చ నిర్వహించారని జగన్ మండిపడ్డారు.

విప్ జారీకి 14రోజుల గడువు ఇవ్వాల్సి ఉన్నా అలా చేయకుండా… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రయత్నించారని విమర్శించారు. చివరకు రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పు కాపీలను తీసుకుని వెళ్తే అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా అనుమతించలేదని, స్పీకర్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడాన్ని తాను తప్పుపట్టడం లేదని.. అయితే చంద్రబాబు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు దగ్గరకు వెళ్లి తిరిగి గెలిపించుకోవాలని సూచించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News