వైసీపీ సభ్యులు సీఎంను కలవాల్సిందే… పరీక్షించి ముందుకెళ్తాం…

నియోజకవర్గాల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌  అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులుకేటాయించకపోవడంపై ఆ పార్టీ సభ్యులు సభను అడ్డుకున్నారు . స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన టీడీపీ నేతలకు ఎలా ఇస్తారని జగన్‌ ప్రశ్నించారు. ఇలా చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో  ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోలను చదవి వినిపించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే […]

Advertisement
Update: 2016-03-29 23:33 GMT

నియోజకవర్గాల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులుకేటాయించకపోవడంపై ఆ పార్టీ సభ్యులు సభను అడ్డుకున్నారు . స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన టీడీపీ నేతలకు ఎలా ఇస్తారని జగన్‌ ప్రశ్నించారు. ఇలా చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు నిధులు మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోలను చదవి వినిపించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే జగన్‌కు స్పీకర్‌ మైక్ కట్ చేశారు. దీంతో విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టారు. దోపిడి రాజ్యం,దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. జోక్యం చేసుకున్న యనమల రామకృష్ణుడు కాస్త ఆసక్తికరమైన వాదన వినిపించారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కావాలనుకునే ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాల్సిందేనన్నారు. ఆయన పరీక్షించి అప్పుడు నిధులు విడుదల చేస్తారని చెప్పారు. అలా కాకుండా నేరుగా ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వడం కుదరదన్నారు.

అయితే ఎమ్మెల్యేలకు కాకుండా ఓడిపోయిన టీడీపీ నేతలకు నిధులు ఎలా కేటాయిస్తున్నారన్న దానిపై మాత్రం యనమల స్పందించలేదు. యనమల సమాధానంతో సంతృప్తి చెందని వైసీపీ ఆందోళన కొనసాగించింది. దీంతో సభను స్పీకర్ పది నిమిషాలు వాయిదా వేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News