విమానం హైజాక్

ఈజిప్ట్ దేశానికి చెందిన విమానం ఒకటి హైజాక్ అయింది. . అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని బెల్ట్ బాంబులు చూపించి ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అనంతరం విమానాన్ని లెజనాన్ సమీపాన ఉండే  సైప్రస్‌లోని లార్నాక విమానాశ్రయంలో  బలవంతంగా దించారు.    విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, రెండు గంటల చర్చల అనంతరం విమానసిబ్బంది, మరో నలుగురు విదేశీయులు మినహా మిగిలిన ప్రయాణికులను వదిలేశారు.  విమానం ఎంఎస్181 హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్టు […]

Advertisement
Update: 2016-03-29 02:15 GMT

ఈజిప్ట్ దేశానికి చెందిన విమానం ఒకటి హైజాక్ అయింది. . అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్ ఎయిర్ విమానాన్ని బెల్ట్ బాంబులు చూపించి ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అనంతరం విమానాన్ని లెజనాన్ సమీపాన ఉండే సైప్రస్‌లోని లార్నాక విమానాశ్రయంలో బలవంతంగా దించారు. విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, రెండు గంటల చర్చల అనంతరం విమానసిబ్బంది, మరో నలుగురు విదేశీయులు మినహా మిగిలిన ప్రయాణికులను వదిలేశారు. విమానం ఎంఎస్181 హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్టు అధికారులు ధ్రువీకరించారు.

హైజాకర్లు ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్లు బయటపెట్టలేదు. విమానాశ్రయంలో విపత్తు నిర్వాహణ బృందాలు మోహరించాయి. ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాదులే విమానాన్ని హైజాక్ చేసినట్టు భావిస్తున్నారు. సిరియాపై అమెరికా దాడులకు ప్రతికారంగానే ఈ విమాన హైజాక్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News