పార్టీ వీడడంపై స్పందించిన జ్యోతుల

పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై జ్యోతుల నెహ్రు స్పందించారు. అధికార పార్టీ వైపు వెళ్తేనే ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. వైసీపీ విధానాలపై అసంతృప్తిని జగన్‌కు తెలియజేశానన్నారు. ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదన్నారు. పార్టీ వీడడంపై కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. యనమల రామకృష్ణుడితో తనకెలాంటి విబేధాలు లేవన్నారు. తాను వ్యక్తులను వ్యతిరేకించడం లేదన్నారు. లోపం తనలోనే ఉండి ఉండవచ్చన్నారు. జగన్ పై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కార్యకర్తల నుంచి […]

Advertisement
Update: 2016-03-28 06:02 GMT

పార్టీ వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై జ్యోతుల నెహ్రు స్పందించారు. అధికార పార్టీ వైపు వెళ్తేనే ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. వైసీపీ విధానాలపై అసంతృప్తిని జగన్‌కు తెలియజేశానన్నారు. ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదన్నారు. పార్టీ వీడడంపై కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు వెల్లడించారు. యనమల రామకృష్ణుడితో తనకెలాంటి విబేధాలు లేవన్నారు. తాను వ్యక్తులను వ్యతిరేకించడం లేదన్నారు. లోపం తనలోనే ఉండి ఉండవచ్చన్నారు. జగన్ పై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. వైసీపీ విధానాలపై తనకు కొన్ని విబేధాలున్నాయన్నారు. పార్టీ వీడడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని జ్యోతుల చెబుతున్నా… ఈ విషయంపై వైసీపీ నేతలు ఎప్పుడో క్లారిటీకి వచ్చేశారని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News