సభలో మిస్సమ్మ గొడవ… చౌదరి ఒక బ్రోకర్- వైసీపీ నేత

అసెంబ్లీలో అనంతపురం నగరంలోని మిస్సమ్మ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. మిస్సమ్మ ట్రస్ట్ భూముల అక్రమణ వెనుక వైసీపీ నేతల హస్తముందని మంత్రులు పల్లె, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి తదితరులు ఆరోపించారు. రాజధానిలో టీడీపీ నేతలు భూములు కొంటే విమర్శలు చేసిన జగన్.. మరి మిస్సమ్మ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే గురున్నాథరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మిస్సమ్మ భూముల విలువ 200 కోట్లని అలాంటి భూములను వైసీపీ నేతలు […]

Advertisement
Update: 2016-03-26 02:53 GMT

అసెంబ్లీలో అనంతపురం నగరంలోని మిస్సమ్మ భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. మిస్సమ్మ ట్రస్ట్ భూముల అక్రమణ వెనుక వైసీపీ నేతల హస్తముందని మంత్రులు పల్లె, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి తదితరులు ఆరోపించారు. రాజధానిలో టీడీపీ నేతలు భూములు కొంటే విమర్శలు చేసిన జగన్.. మరి మిస్సమ్మ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే గురున్నాథరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మిస్సమ్మ భూముల విలువ 200 కోట్లని అలాంటి భూములను వైసీపీ నేతలు కాజేసేందుకు ప్రయత్నించారని మంత్రి పల్లెరఘునాథరెడ్డి ఆరోపించారు. వైఎస్ అనుచరులు ఈ కబ్జా వెనుక ఉన్నారని విమర్శించారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇందుకు స్పందించిన జగన్… మార్చి ఆఖరి నాటికి సీఐడీ విచారణ పూర్తవుతుందని ప్రభుత్వమే చెబుతోందని అలాంటప్పుడు తప్పులు జరిగినట్టు విచారణలో తేలితే ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. అక్రమాలు ఎవరూ చేసినా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది విచారణ పూర్తవుతోంది ఇక తాను చెప్పేదేముంటుందని జగన్‌ అన్నారు. ఎక్కడో అనంతపురంలో ఎవరో భూములు అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే దాని వెనుక కూడా వైఎస్‌ హస్తముందని ఆరోపించడం దారుణమన్నారు.

మరోవైపు సభలో తనపై ఆరోపణలు చేసిన పల్లె, ప్రభాకర్ చౌదరిపై మాజీ ఎమ్మెల్యే గురున్నాథరెడ్డి స్పందించారు. ప్రభాకర్‌ చౌదరి ఒక బ్రోకర్ అని విమర్శించారు. మిస్సమ్మ భూముల వ్యవహారంలో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. పల్లె రఘునాథరెడ్డి జిల్లాలో చేస్తున్న అక్రమాలకు సంబంధించిన చిట్టా మొత్తం తమకు తెలుసన్నారు గురున్నాథరెడ్డి. అక్రమాలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News