‘’మా అన్నయ్యకు కుర్రతనం పోలేదు’’

హైకోర్టులో రోజాకు వ్యతిరేకంగా తీర్పు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే అనిత హర్షం వ్యక్తం చేశారు. నేడు తనకో శుభదినం అన్నారు. రోజా అహంకారం ఓడి… తన ఆవేదన గెలిచిందన్నారు. క్షమాపణ చెప్పేందుకు సభ అవకాశం ఇచ్చినా రోజా కోర్టుకు వెళ్లారని విమర్శించారు. ఈ తీర్పుతో వైసీపీకి కనువిప్పు కావాలన్నారు. జగన్‌ది ఇంతకాలం అవగాహన రాహిత్యం అనుకున్నామని… కానీ మా అన్నయ్యకు(జగన్) ఇంకా కుర్రతనం పోయినట్టుగా లేదన్నారు అనిత.  అన్నయ్యలు రోజా కోసం నల్లచొక్కాలు వేసుకుని సభకు రావడం […]

Advertisement
Update: 2016-03-22 04:18 GMT

హైకోర్టులో రోజాకు వ్యతిరేకంగా తీర్పు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే అనిత హర్షం వ్యక్తం చేశారు. నేడు తనకో శుభదినం అన్నారు. రోజా అహంకారం ఓడి… తన ఆవేదన గెలిచిందన్నారు. క్షమాపణ చెప్పేందుకు సభ అవకాశం ఇచ్చినా రోజా కోర్టుకు వెళ్లారని విమర్శించారు. ఈ తీర్పుతో వైసీపీకి కనువిప్పు కావాలన్నారు. జగన్‌ది ఇంతకాలం అవగాహన రాహిత్యం అనుకున్నామని… కానీ మా అన్నయ్యకు(జగన్) ఇంకా కుర్రతనం పోయినట్టుగా లేదన్నారు అనిత. అన్నయ్యలు రోజా కోసం నల్లచొక్కాలు వేసుకుని సభకు రావడం కాకుండా ప్రజా సమస్యలపై పోరాటానికి నల్లచొక్క వేసుకోవాలని అనిత అన్నారు. వ్యక్తి కోసం వ్యవస్థలను దెబ్బతీయవద్దన్నారు. ఇప్పటికైనా జగన్‌ తీరు మార్చుకోవాలన్నారు.

అటు బోండా ఉమా, కూన రవికుమార్ కూడా వైసీపీ తీరును తప్పుపట్టారు. కోర్టు తీర్పును చూసి మహిళలంతా గర్వపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఉదారంగా ఉంది కాబట్టే ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణ చెప్పేందుకు రోజాకు మరో అవకాశం ఇచ్చిందన్నారు.. వైసీపీ అహంకారం అనే ఆయుధంతో పనిచేయాలనుకుంటోందని విమర్శించారు. వైసీపీకి వ్యక్తులే తప్ప వ్యవస్థలు ముఖ్యం కాదన్నారు. సభలో స్పీకర్‌ నిర్ణయమే ఫైనల్ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News