రాజకీయాలకు గుడ్‌ బై చెప్పిన జేపీ

లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై ఏ  ఎన్నికల్లో కూడా లోక్‌సత్తా పోటీ చేయబోదని జేపీ ప్రకటించారు. ఇకపై లోక్‌సత్తాను రాజకీయపార్టీగా చూడవద్దని కోరారు.  స్థానిక సంస్థల అధికారాలు, ప్రజాసమస్యలపై  లోక్‌సత్తా పోరాడుతుందని చెప్పారు. ఇకపై లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా పరిగణించవద్దని కోరారు. తొలుత లోక్‌సత్తాను ఒక సంస్థగా జేపీ నెలకొల్పారు. అనంతరం దాన్ని రాజకీయపార్టీగా మార్చి  ఎన్నికల్లో పోటీ చేశారు.  2009లో కూకట్‌ పల్లి ఎమ్మెల్యేగా జేపీ గెలిచారు. అయితే ఆ […]

Advertisement
Update: 2016-03-22 01:11 GMT

లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లో కూడా లోక్‌సత్తా పోటీ చేయబోదని జేపీ ప్రకటించారు. ఇకపై లోక్‌సత్తాను రాజకీయపార్టీగా చూడవద్దని కోరారు. స్థానిక సంస్థల అధికారాలు, ప్రజాసమస్యలపై లోక్‌సత్తా పోరాడుతుందని చెప్పారు. ఇకపై లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా పరిగణించవద్దని కోరారు.

తొలుత లోక్‌సత్తాను ఒక సంస్థగా జేపీ నెలకొల్పారు. అనంతరం దాన్ని రాజకీయపార్టీగా మార్చి ఎన్నికల్లో పోటీ చేశారు. 2009లో కూకట్‌ పల్లి ఎమ్మెల్యేగా జేపీ గెలిచారు. అయితే ఆ పార్టీ మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మొన్నటి ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్‌సభకు పోటీ చేసిన జయప్రకాశ్ నారాయణ ఓడిపోయారు. లోక్‌సత్తాకు ఇతర రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. అయితే రాజకీయాలు లోక్‌సత్తాకు సెట్ అవవన్న భావనకు వచ్చిన జేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News