ఎమ్మెల్యే బుగ్గనకు ప్రమోషన్ ఇచ్చిన జగన్

అసెంబ్లీలో తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి జగన్ మరో కీలక పదవి అప్పగించారు. భూమానాగిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీఏసీ పదవికి బుగ్గనను ఎంపిక చేశారు. లోటస్ పాండ్‌లో జరిగిన వైఎస్‌ఆర్సీఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ చైర్మన్‌గా బుగ్గన పేరును ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు జగన్ లేఖ రాయనున్నారు. బుగ్గన కూడా  కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తే. డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పీఏసీ […]

Advertisement
Update: 2016-03-21 01:19 GMT

అసెంబ్లీలో తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి జగన్ మరో కీలక పదవి అప్పగించారు. భూమానాగిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీఏసీ పదవికి బుగ్గనను ఎంపిక చేశారు. లోటస్ పాండ్‌లో జరిగిన వైఎస్‌ఆర్సీఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ చైర్మన్‌గా బుగ్గన పేరును ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు జగన్ లేఖ రాయనున్నారు. బుగ్గన కూడా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తే. డోన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పీఏసీ పదవి కోసం జ్యోతుల, పెద్దిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అమర్‌నాథ్ రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. అయితే వారందరినీ కాకుండా వివాదరహితుడైన బుగ్గనను జగన్‌ ఎంపిక చేశారు. బుగ్గనకు ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్ వంటి అంశాలపై మంచి పట్టు ఉండడంతో ఆయనను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.

Click on Image to Read:

Advertisement

Similar News