వెంకయ్యకు అంత కష్టం ఏమొచ్చింది?

“మోడీ ఇండియాకు దేవుడిచ్చిన వరం”,”భారత పేదల అభ్యున్నతికోసం దేవుడు పంపిన దూత మోడీ” అంటూ బీజేపీ సీనియర్‌ నేత, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీని పొగిడిన తీరుకు బీజేపీ జాతీయ నాయకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. బీజేపీ పార్టీలో ఒకప్పుడు వెంకయ్య ముందు మోడీ చాలా చిన్న నేత. ఇప్పుడు ఈక్వేషన్లు మారాయి. మూడు నెలల్లో వెంకయ్య రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. మోడీ దయతలచకపోతే రాజ్యసభ సభ్యత్వంతో […]

Advertisement
Update: 2016-03-21 02:18 GMT

“మోడీ ఇండియాకు దేవుడిచ్చిన వరం”,”భారత పేదల అభ్యున్నతికోసం దేవుడు పంపిన దూత మోడీ” అంటూ బీజేపీ సీనియర్‌ నేత, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీని పొగిడిన తీరుకు బీజేపీ జాతీయ నాయకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. బీజేపీ పార్టీలో ఒకప్పుడు వెంకయ్య ముందు మోడీ చాలా చిన్న నేత. ఇప్పుడు ఈక్వేషన్లు మారాయి. మూడు నెలల్లో వెంకయ్య రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. మోడీ దయతలచకపోతే రాజ్యసభ సభ్యత్వంతో పాటు మంత్రి పదవికూడా సహజంగానే పోతుంది. తమ రాష్ట్రం నుంచి వెంకయ్యని రాజ్యసభకు పంపడానికి కర్ణాటక ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆయన ఆశ అంతా చంద్రబాబు నాయుడిమీదే. అందుకే ఇప్పుడు వెంకయ్య బీజేపీ నాయకుడో, తెలుగుదేశం నాయకుడో అర్ధం కానంతగా చంద్రబాబు ప్రభుత్వంతో మమేకమైపోయాడు.

అక్కడ కేంద్రంలోను అంతాతానై మోడీకి తలలో నాలుకలా వ్యవహరిస్తున్నాడు. తన అవసరాన్ని మోడీ గుర్తించేలా చేయగలుగుతున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పుడూ ఆయన బీజేపీ అధినాయకులుగా ఎవరుంటే వారికి అత్యంత ఆప్తుడు. ఎల్‌కే అద్వానీకి ఎంతటి ఆప్తుడో, వాజ్‌పేయ్‌కి అంతే ఆప్తుడు. అంతెందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర హిందూ సంస్థలకు ఎవరు అధినాయకులుఅయితే వాళ్లందరికీ అత్యంత ఆప్తుడు.

అంతటి రాజకీయ చాతుర్యం కలిగిన వెంకయ్యనాయుడు ఇంతగా తగ్గిపోయి మోడీని కీర్తించడం విని బీజేపీ సీనియర్‌ నాయకులు విస్తుపోయారు. రాజ్యసభ సీటు రెన్యువల్ కోసం మరీ ఇంతగా పొగడడం అవసరమా అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అందులోనూ ఏపీకి వస్తే చంద్రబాబును, ఢిల్లీకి వెళ్తే మోడీని పొగడడం వెంకయ్యకు ఈ మధ్య అలవాటుగా మారిందంటున్నారు. అయితే ఈ పొగడ్తలు మనస్పూర్తిగా చేస్తున్నవేనా కాదా అన్నది రాజ్యసభ ఎన్నికలు ముగిస్తే తేలిపోతుందంటున్నారు. ఏదీ ఏమైనా వెంకయ్య లాంటి సీనియర్ నేతలు… దైవదూత, దేవుడిచ్చిన వరం అంటూ మోదీని ఆకాశానికి ఎత్తడం చూడ్డానికి ఏమాత్రం బాగోలేదంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News