జగన్‌ ఆస్తుల కేసులో హైకోర్టు కీలక తీర్పు

జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది.   ఇండియా సిమెంట్ అధినేత , బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాసన్‌పై కేసును కొట్టివేసింది.  క్విడ్‌ ప్రోకోలో భాగంగానే శ్రీనివాసన్.. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.  దీన్ని శ్రీనివాసన్‌ హైకోర్టులో సవాల్ చేశారు.  పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ శివశంకరరావు… ఇండియా సిమెంట్స్‌ కు చేసిన నీటి, భూకేటాయింపులకు, జగన్‌ […]

Advertisement
Update: 2016-03-18 21:34 GMT

జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి హైకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. ఇండియా సిమెంట్ అధినేత , బీసీసీఐ మాజీ చైర్మన్ శ్రీనివాసన్‌పై కేసును కొట్టివేసింది. క్విడ్‌ ప్రోకోలో భాగంగానే శ్రీనివాసన్.. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. దీన్ని శ్రీనివాసన్‌ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ శివశంకరరావు… ఇండియా సిమెంట్స్‌ కు చేసిన నీటి, భూకేటాయింపులకు, జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధం లేదని తేల్చారు. ఈ వ్యవహారంలో శ్రీనివాసన్ వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ది పొందలేదని తీర్పు వెలువరించారు.

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందుకు ఇండియా సిమెంట్స్‌కు అప్పటి వైఎస్ ప్రభుత్వం కడప జిల్లా, చౌడూరులో 2.60 ఎకరాల భూమి లీజు పొడిగింపు, కాగ్నా, కృష్ణా నదుల నుంచి నీటి కేటాయింపులు చేసిందని ఆరోపిస్తూ శ్రీనివాసన్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్విడ్ ప్రోకోలో భాగంగా రూ. 140 కోట్లు శ్రీనివాసన్ పెట్టుబడులుగా పెట్టారని చార్జిషీట్‌లో పేర్కొంది. అయితే బోర్డు తీర్మానం మేరకే పెట్టుబడుల నిర్ణయం జరిగిందన్నారు. రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎండీకి అధికారాన్ని కల్పిస్తూ బోర్డు చేసిన తీర్మానాన్ని శ్రీనివాసన్ తరపు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ వాదనతో న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఏకీభవించారు. కంపెనీ చర్యలకు ఎండీని బాధ్యుడిగా చేయడం తగదంటూ సునీల్ భారతి మిట్టల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు తీర్పును న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. శ్రీనివాసన్‌పై చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News