పశ్చిమలో సంపూ హల్ చల్

ఎక్కడికెళ్లినా తెగ వరాలు ప్రకటిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయంతో ఇండస్ట్రీలో సెట్ అయిపోయిన ఈ హీరో…. దాతృత్వంలో కూడా తనకుతానే సాటి అనిపించుకున్నాడు. చాలా సందర్భాల్లో విరాళాలు ప్రకటించిన హృదయకాలేయం చాలా పెద్దదని నిరూపించుకున్నాడు. తాజాగా అలాంటిదే మరో పని చేశాడు మన సంపూ. ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే సినిమా చేస్తున్నాడు ఈ కామెడీ స్టార్. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని అరటికట్ల గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో దగ్గర్లోని పాఠశాలను సందర్శించాడు […]

Advertisement
Update: 2016-03-19 00:00 GMT

ఎక్కడికెళ్లినా తెగ వరాలు ప్రకటిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయంతో ఇండస్ట్రీలో సెట్ అయిపోయిన ఈ హీరో…. దాతృత్వంలో కూడా తనకుతానే సాటి అనిపించుకున్నాడు. చాలా సందర్భాల్లో విరాళాలు ప్రకటించిన హృదయకాలేయం చాలా పెద్దదని నిరూపించుకున్నాడు. తాజాగా అలాంటిదే మరో పని చేశాడు మన సంపూ. ప్రస్తుతం కొబ్బరి మట్ట అనే సినిమా చేస్తున్నాడు ఈ కామెడీ స్టార్. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని అరటికట్ల గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో దగ్గర్లోని పాఠశాలను సందర్శించాడు సంపూర్ణేష్ బాబు. విద్యార్థుల్లో స్ఫూర్తి రగిల్చేలా పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. నలుగురు మనల్ని గుర్తుపట్టేలా, గర్వించేలా పేరుతెచ్చుకోవాలని అన్నాడు. ఈ సందర్భంగా అరటికట్ల పాఠశాల విద్యార్థులకు ఆఫర్ ఇచ్చాడు. ఎవరైతే టాప్ ర్యాంక్ వాళ్లకు మనీ ప్రైజ్ ఇస్తానని ప్రకటించాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయికి పది వేలు…. అదే అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తే 15వేలు ఇస్తానని సంపూ ఎనౌన్స్ చేశాడు.

Tags:    
Advertisement

Similar News