మేం కోర్టు వైపే ఉంటాం... సీఎంకు ఆ నాలుగు ఉంటే ముందుకు రావాలి

రోజాను సభలోకి అనుమతించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ అమలు చేయకపోవడంపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ పూర్తిగా దిగజారిపోయిందన్నారు. కనీసం నిరసన తెలిపేందుకు రెండు నిమిషాలు మైక్‌ అడిగినా స్పీకర్‌ ఇవ్వడం  లేదన్నారు. ఇంత కన్నా దిక్కుమాలిన సభ ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం అంటే న్యాయవ్యవస్థను అవహేళన చేయడం కాదా అని ప్రశ్నించారు. అందుకే హైకోర్టు తీర్పుపై జరిగే చర్చలో తాము భాగస్వాములం కాబోమన్నారు.  అందుకే […]

Advertisement
Update: 2016-03-19 02:24 GMT

రోజాను సభలోకి అనుమతించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీ అమలు చేయకపోవడంపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ పూర్తిగా దిగజారిపోయిందన్నారు. కనీసం నిరసన తెలిపేందుకు రెండు నిమిషాలు మైక్‌ అడిగినా స్పీకర్‌ ఇవ్వడం లేదన్నారు. ఇంత కన్నా దిక్కుమాలిన సభ ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీలో చర్చించడం అంటే న్యాయవ్యవస్థను అవహేళన చేయడం కాదా అని ప్రశ్నించారు. అందుకే హైకోర్టు తీర్పుపై జరిగే చర్చలో తాము భాగస్వాములం కాబోమన్నారు. అందుకే సోమవారం వరకు సభను బహిష్కరిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పుపై అధికార పక్షం ఒక్కటే చర్చించుకోవాలన్నారు. తాము హైకోర్టు పక్షానే నిలుస్తామన్నారు. రాజకీయాల కోసం స్పీకర్ కార్యాలయాన్ని కూడా చంద్రబాబు ఎలా వాడుకుంటున్నారో అందరూ చూస్తున్నారన్నారు.

చంద్రబాబుకు నిజంగా సిగ్గు, లజ్జ, రోషం, పౌరుషం ఉంటే వెంటనే పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు జగన్. సభ నుంచి రోజాను అధికారపక్షం సస్పెండ్ చేయించిందని… అలాంటప్పుడు ఏకగ్రీవంగా సభ రోజాను సస్పెండ్ చేసిందని స్పీకర్ ఎలా ప్రకటిస్తారని జగన్ ప్రశ్నించారు. రోజాపై చర్యలను తమ పార్టీ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించిన విషయం గుర్తు లేదా అన్నారు.

ప్రివిలేజ్ కమిటీకి అర్థముందా అని జగన్ ప్రశ్నించారు. ప్రివిలేజ్ కమిటీలో చైర్మన్‌ నుంచి సభ్యుల వరకు అంతా అధికారపక్షం వారే అయినప్పుడు ఇక తమకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు. ‘’హేయ్… అంతుచూస్తా.. పిచ్చపిచ్చగా ఉందా.. సంగతి తేలుస్తా’’ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రతిపక్షాన్ని బెదిరిస్తే ప్రివిలేజ్ కమిటీ ఏం చేసిందని ప్రశ్నించారు. ‘’పాతేస్తాం, నరికేస్తాం, ఖబర్దార్, మగతనం ఉందా, కొవ్వెక్కింది’’ వంటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులపై ప్రివిలేజ్ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేసిన జగన్ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News